‘భరత్ అనే నేను’ సినిమా పోస్టర్
సాక్షి, గుంటూరు(లక్ష్మీపురం): కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘నవోదయం పార్టీ’పై దుష్ప్రచారం చేశారని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు సోమవారం ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీని 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నల్లకరాజు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా సినిమాలో చూపించారని ఆరోపించారు.
తమ పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడు గుర్తుని, నవోదయం అనే తమ పార్టీ పేరును సినిమాలో పలుసార్లు చూపిస్తూ అప్రజాస్వామికమైన పదజాలం వాడి తమ పార్టీ లక్ష్యాలకు పూర్తి వ్యతిరేకమైన మాటలను సన్నివేశాల్లో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నవోదయం పార్టీ తరఫున ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment