gutur
-
కొత్త గేట్ ఏర్పాటుకి ప్రతిపాదనలు పంపుతాం
-
‘భరత్ అనే నేను’ సినిమాపై ఫిర్యాదు
సాక్షి, గుంటూరు(లక్ష్మీపురం): కొరటాల శివ దర్శకత్వంలో మహేష్‌బాబు నటించిన ‘భరత్ అనే నేను’ సినిమాలో ‘నవోదయం పార్టీ’పై దుష్ప్రచారం చేశారని గుంటూరు జిల్లా అర్బన్ ఎస్పీ గ్రీవెన్స్‌లో ఆ పార్టీ అధ్యక్షుడు నల్లకరాజు సోమవారం ఫిర్యాదు చేశారు. నవోదయం పార్టీని 2010లో స్థాపించి కేంద్ర ఎన్నికల కమిషన్‌తో రిజిస్ట్రేషన్ కూడా చేయించినట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా నల్లకరాజు మీడియాతో మాట్లాడుతూ.. తమ పార్టీ పట్ల ప్రజల్లో ద్వేషం కలిగించేలా సినిమాలో చూపించారని ఆరోపించారు. తమ పార్టీ జెండాలో ఉన్న ఉదయించే సూర్యుడు గుర్తుని, నవోదయం అనే తమ పార్టీ పేరును సినిమాలో పలుసార్లు చూపిస్తూ అప్రజాస్వామికమైన పదజాలం వాడి తమ పార్టీ లక్ష్యాలకు పూర్తి వ్యతిరేకమైన మాటలను సన్నివేశాల్లో చూపించారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై నవోదయం పార్టీ తరఫున ఎస్పీకి ఫిర్యాదు చేసి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరినట్లు తెలిపారు. -
సహజీవనం, జంట అనుమానాస్పద మృతి
మంగళగిరి: గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఆరేళ్లుగా సహజీవనం చేస్తున్న ఓ జంట అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని మంగళగిరి మండలం పెదవడ్లపూడి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. గత ఆరేళ్లుగా గ్రామంలో నివాసముంటున్న జాన్(30), దుర్గ(25)ల మృతదేహలు అనుమానాస్పద స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
వికటించిన విందు
► వాంతులు, విరోచనాలతో మంచం పట్టిన ఏనుగుపాలెం గ్రామస్తులు ► 230 మందికి పైగా అస్వస్థత వినుకొండ రూరల్: నూతన వధూవరులను కలిపే శుభ వేడుక గ్రామంలో మండలంలోని ఏనుగుపాలెంలో విషాదం నింపింది. వేడుక సందర్భంగా గురువారం గ్రామంలో ఏర్పాటు చేసిన విందుకు హాజరైన వారందరూ విషాహారం తిని ఆసుపత్రి పాలయ్యారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేపింది. తెలిసిన వివరాల ప్రకారం.. మండలంలోని ఏనుగుపాలెం గ్రామానికి చెందిన పాపసాని శ్రీనివాసరావుకు శావల్యాపురం మండలం గుంటుపాలెంకు చెందిన విజయలక్ష్మితో ఈ నెల 6న తిరుపతిలో ఘనంగా వివాహం జరిగింది. వివాహ సందర్భాన్ని పురస్కరించుకొని ఈ నెల 11న గ్రామంలో సత్యనారాయణస్వామి వ్రతం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విందు వికటించి బంధువులు, గ్రామస్తులు ఆస్పత్రి పాలయ్యారు. విందు జరిగిన మరుసటి రోజు (శుక్రవారం) కడుపులో నొప్పి రావడంతో పలువురు స్థానిక వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకున్నారు. వారు రాసిచ్చిన మందులు వాడినా ప్రయోజనం లేకపోవడంతో సమస్య తీవ్రతరం దాల్చింది. శనివారం ఉదయం కూడా వాంతులు, విరేచనాలు ఆగకపోవడంతో ఒక్కొక్కరుగా గ్రామంలోని పీహెచ్సీ అంతా నిండిపోయింది. పరిస్థితి విషమంగా ఉన్న వారిని వైద్యులను వినుకొండ ప్రభుత్వ వైద్యశాలకు తరలించాలని సూచించడంతో ఈ మేరకు బంధువులు తరలించారు. ఉదయం 10 గంటలలోపే రోగుల సంఖ్య 200 దాటిపోయింది. వీరితో పాటు పెరుమాళ్ళపల్లి, చినకంచర్లకు చెందిన బంధువులు కూడా ఇదే విధంగా వైద్యశాలకు వచ్చారు. పెళ్లి కుమార్తె స్వగ్రామమైన గుంటుపాలెంలో కూడా 30 మంది వరకూ అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. బాధితులందరికీ సకాలంలో వైద్యసాయం అందడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. జరిగిన పరిణామాల రీత్యా ఆహారం విషతుల్యం అయినట్లు వైద్యులు భావిస్తున్నారు. రాజకీయ నాయకుల పరామర్శ సమాచారం తెలుసుకున్న శాసన సభ్యుడు జీవీ ఆంజనేయులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బొల్లా బ్రహ్మనాయుడు హుటాహుటినా ఏనుగుపాలెం ప్రాథమిక వైద్యశాలకు చేరుకున్నారు. బాధితులను పరామర్శించారు. ఘటన గురించి ఆరా తీశారు. డిప్యూటీ డీఎంఅండ్‌హెచ్‌వో మురళీకృష్ణతో పాటు వైద్యశాల అభివృద్ధి కమిటీ చైర్మన్ వేముల సత్యనారాయణ వినుకొండ నుంచి రోగులకు కావాల్సిన మందులు తెప్పించి మరీ చికిత్స అందించారు. -
చిచ్చు రేగింది..!
► సంస్థాగత ఎన్నికలతో టీడీపీలో విభేదాలు బహిర్గతం ► మంత్రి రావెల సమక్షంలోనే తమ్ముళ్ల బాహాబాహీ ► డివిజన్ అధ్యక్షులను ప్రకటించిన ఎమ్మెల్యే మోదుగుల ► మోదుగుల జాబితా చెల్లదంటున్న నగర అధ్యక్షుడు బోనబోయిన సాక్షి, గుంటూరు : జిల్లా టీడీపీలో సంస్థాగత ఎన్నికలు చిచ్చు రేపుతున్నాయి. టీడీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్ళు కావస్తున్నా తమకు ఎటువంటి న్యాయం జరుగలేదని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులతో పాటు, గ్రామాల్లోని కార్యకర్తలు నేతల తీరు పట్ల తీవ్ర స్థాయిలో రగిలిపోతున్నారు. ఈ సమయంలో గ్రామ, మండలాల్లో టీడీపీ సంస్థాగత ఎన్నికలు నిర్వహించాలని పార్టీ అధిష్టానం నిర్ణయించడం పార్టీ జిల్లా నేతలకు తలనొప్పిగా మారింది. ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు గ్రూపులుగా విడిపోయి తమ వర్గానికే పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతుండటంతో గ్రామ, మండల స్థాయి పార్టీ అధ్యక్షుల ఎంపిక అధికార పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలకు ఇబ్బందికరంగా మారింది. దీంతో జాబితా సిద్ధం చేసినా బయట పెట్టకుండా రహస్యంగా ఉంచుతున్నారు. ఇప్పటికే అనేక నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికల సందర్భంగా పార్టీ నాయకుల మధ్య విభేదాలు బహిర్గతం అవుతున్నాయి. జిల్లాలో టీడీపీ నేతల అంతర్గత పోరు సంస్థాగత ఎన్నికల నేపథ్యంలో బహిర్గతమవుతోంది. ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ తన్నులాటకు సైతం సై అంటున్నారు. ఇటీవల గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలోని 26 డివిజన్లకు ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి పార్టీ డివిజన్ అధ్యక్షులను నియమిస్తూ జాబితాను ప్రకటించారు. ఇది జరిగిన కొద్దిసేపటికే పార్టీ నగర అధ్యక్షుడు బోనబోయిన శ్రీనివాసయాదవ్ పత్రికా విలేకరులకు ఫోన్ చేసి మోదుగుల ప్రకటించిన జాబితా చెల్లదని, జిల్లా పార్టీ అధ్యక్షుడు, పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. గతంలోనూ డివిజన్ అధ్యక్షుల ఎంపికలో ఎమ్మెల్యే మోదుగులకు వ్యతిరేకంగా బోనబోయిన ప్రతి డివిజన్లో తమ వర్గం వారిని అధ్యక్షుడుగా నియమించడం తెలిసిందే. మాచర్ల, మంగళగిరి, గుంటూరు తూర్పు, పశ్చిమ, తాడికొండ, ప్రత్తిపాడు వంటి నియోజకవర్గాల్లో సంస్థాగత ఎన్నికల చిచ్చు పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రూపులుగా చీలి బాహాబాహీకి దిగుతున్నారు. వీరికి నచ్చజెప్పలేక ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు సైతం పార్టీ గ్రామ, మండల అధ్యక్షుల ఎంపికను వాయిదా వేస్తున్నారు. మంత్రి ఎదుటే తమ్ముళ్ల తన్నులాట గుంటూరు రూరల్ మండలంలో పార్టీ గ్రామ అధ్యక్షుల ఎంపిక నేతల తన్నులాటకు దారి తీసింది. సాక్షాత్తూ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్‌బాబు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రత్తిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలంలో పార్టీ గ్రామ అధ్యక్షుల ఎంపిక కోసం ఇరువర్గాలు తన్నులాటకు దిగాయి. మంత్రి ఎదుటే ఒకరిని ఒకరు చొక్కాలు చించుకుని కొట్టుకున్నారు. మంత్రి సముదాయించినా గొడవ సద్దుమణగకపోవడంతో పోలీసు బలగాలు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చాయి. ముఖ్యంగా రూరల్ మండలంలోని పొత్తూరు, చౌడవరం, వెంగళాయపాలెం, తురకపాలెం, చినపలకలూరు గ్రామ పార్టీ అధ్యక్షుల ఎంపిక విషయంలో పార్టీ నేతలు హర్షవర్ధన్, వెంగళాయపాలెం ఎంపీటీసీ తనయుడు కల్లూరి శ్రీనుల మధ్య వాదులాట జరిగింది. మంత్రి రావెలతో మాట్లాడుతూనే ఒకరిపై ఒకరు దూషణలకు దిగుతూ తన్నుకున్నారు. దీంతో అర్బన్ పరిధిలోని పలు పోలీసు స్టేషన్ల సీఐలు, డీఎస్పీలు మంత్రి నివాసం వద్దకు చేరుకుని పార్టీ శ్రేణులను చెదరగొట్టి పరిస్థితిని చక్కదిద్దారు. మరుసటి రోజు కూడా ఇద్దరికి చెందిన వర్గాల కార్యకర్తలు ఒకరికొకరు వత్తాసుగా మంత్రి కార్యాలయం వద్దకు చేరుకుని నిరసనల నినాదాలు చేశారు. దీంతో మంత్రి కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి కార్యకర్తలను చెదరగొట్టారు. ఈ వ్యవహారం జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలో సాక్షాత్తూ మంత్రి సమక్షంలో టీడీపీ నాయకులు తన్నుకోవడం చూస్తుంటే జిల్లాలో టీడీపీ పరిస్థితి ఏవిధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. పదవుల కోసం నేతలు తన్నులాటకు దిగుతున్న తీరును చూసి జిల్లా టీడీపీ శ్రేణులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
రెండు సామాజిక వర్గాల మధ్య ఘర్షణ
ఈపూరు: గుంటూరు జిల్లాలో రెండు సామాజిక వర్గాల మధ్య మంగళవారం ఘర్షణ చోటు చేసుకుంది. ఈ సంఘటన ఈపూరు మండలకేంద్రంలో జరిగింది. ఈపూరుకు చెందిన ముద్ద మణెమ్మ(60) అనారోగ్యంతో సోమవారం మృతిచెందింది. ఈమె బీసీ కులానికి చెందినది. అయితే అంత్యక్రియలకు శ్మశాన వాటికకు తీసుకెళ్తుండగా.. మా శ్మశాన వాటికకు తీసుకురావద్దు అని ఎస్సీలు అడ్డుతగిలారు. తరతరాలుగా మేము కూడా ఇదే శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని బీసీలు తెలిపారు. ఈ విషయంలో ఘర్షణ జరిగి . దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి ఇరువర్గాలకు సర్దిచెబుతున్నారు. -
నాకేంటో నాకే తెలియదు
అవసరాలకు పార్టీలోకి వచ్చిన వారికే పెద్దపీట వేస్తున్నారు రామనారాయణరెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదు లోకేష్‌తో మాట్లాడాకే ఉండాలా? పోవాలా? నిర్ణయం మద్దతుదారుల ఆత్మీయ సమావేశంలో గూటూరు కన్నబాబు సాక్షి ప్రతినిధి, నెల్లూరు:‘‘పార్టీలో నా కేందనేది నాకే తెలియదు. రామనారాయణరెడ్డిని ఇన్‌చార్‌్జగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చే ముందు నన్ను కూర్చోబెట్టి మాట్లాడి కలిసి పనిచేయాలని చెప్పివుంటే నాకు గౌరవంగా ఉండేది. పార్టీలో నా పరిస్థితే ఇలా ఉంటే, మీ గుర్తింపు విషయంలో నేనేం హామీ ఇవ్వగలను’’ ఆత్మకూరు టీడీపీ నాయకుడు గూటూరు కన్నబాబు తన మద్దతు దారుల ముందు వ్యక్తం చేసిన ఆవేదన, ఆందోళన, ఆక్రోషం ఇది. రామనారాయణరెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా నియమించిన నేపథ్యంలో తామేం చేయాలనే అంశం గురించి చర్చించడానికి ఆత్మకూరు మండలం కరటంపాడులోని తన ఇంట్లో కన్నబాబు సోమవారం ఆత్మీయుల సమావేశం జరిపారు. మాజీ మంత్రి రామనారాయణరెడ్డిని నియోజకవర్గ ఇన్‌చార్‌్జగా నియమిస్తూ ఉత్తర్వులు వచ్చిన రోజు కన్నబాబుతో పాటు ఆయన ముఖ్య అనుచరులంతా సెల్ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకున్నారు. మరుసటి రోజు కన్నబాబు ముఖ్యులతో మాట్లాడుకుని కొన్ని రోజులు వేచి చూసి ఏం చేయాలనే దానిపై నిర్ణయం తీసుకుందామని తీర్మానించుకున్నారు. రేపో, మాపో రామనారాయణరెడ్డి నియోజకవర్గంలో కాలు పెట్టబోతున్నారనీ, తామేం చేయాలని మద్దతుదారుల నుంచి కన్నబాబు మీద ఒత్తిడి ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆయన నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి పార్టీ ముఖ్యులు, ముఖ్య కార్యకర్తలను సమావేశానికి పిలిచారు. మీడియాను అనుమతించకుండా జరిపిన సమావేశంలో తొలి నుంచి టీడీపీలో ఉన్న కార్యకర్తలు పార్టీ హై కమాండ్ విధానంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ‘‘ఇంతకీ చంద్రబాబు నాయుడు మీకేం చెప్పారు’’అని ఆయ న మద్దతుదారులు ప్రశ్నించారు. తనకైతే ఎలాంటి హామీ ఇవ్వలేదనీ, జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర ఈరోజు (సోమవారం) ఉదయమే పిలిస్తే వెళ్లాననీ, ఆయనతో గంట సేపు మాట్లాడినా నా పరిస్థితి ఏమిటో స్పష్టంగా చెప్పలేక పోయారని కన్నబాబు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీని నమ్ముకుని ఉన్న వారికంటే మధ్యలో వచ్చిన వారికే గుర్తింపు, పదవులు ఇస్తున్నారనీ చంద్రబాబు కానీ, జిల్లా ముఖ్యులు కానీ తనకేం చేయబోతున్నారనే విషయం చెప్పలేదన్నారు. రామనారాయణరెడ్డితో కలిసి పనిచేసే ప్రసక్తే లేదనీ, శనివారం రామనారాయణరెడ్డి తనకు ఫోన్ చేసినప్పుడు ఇదే విషయం గట్టిగా చెప్పానని కన్నబాబు కార్యకర్తలకు వివరించారు. ఇలాంటి పరిస్థితుల్లో అవమానాలు ఎదుర్కొంటూ ఈ పార్టీలోనే ఎందుకు ఉండాలి? వైఎస్సార్ సీపీలో చేరదాం పదండి. అని కొందరు నాయకులు తమ అభిప్రాయం వెల్లడించారు. తొలి నుంచి పార్టీనే నమ్ముకున్నందువల్ల తాను తొందరపడి ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేననీ, ఇప్పటికిప్పుడు టీడీపీలో తనకు ఏదో మేలు జరుగుతుందనే నమ్మకం కూడా లేదని కన్నబాబు వివరించారు. నాలుగైదు రోజు ల్లో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌బాబును కలిసి ఆయనతో అన్ని విషయాలు చర్చించాకే ఒక నిర్ణయానికి వద్దామని కన్నబాబు తన మద్దతుదారులకు సూచించారు. కన్నబాబు ఏ నిర్ణయం తీసుకున్నా ఆయనతోనే ఉం డాలని సమావేశానికి హాజరైన వారం తా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. ఆనంతో కలిసే ప్రసక్తే లేదని తెగేసి చెబుతున్న కన్నబాబు అదే మాట మీద ఉంటారా? లేక చినబాబో, పెద్దబాబో పిలిచి బుజ్జగిస్తే మనసు మా ర్చుకుంటారా? అనేది వేచి చూడాల్సి వుంది. మొత్తం మీద ఆనం రామనారాయణరెడ్డికి నియోజకవర్గంలో అధికారికంగా అడుగుపెట్టకముందే అసంతృప్తుల సెగ ప్రారంభమైంది. -
కృష్ణకు అటూ ఇటూ!