
'జనసేన' పార్టీపై ఈసికి ఫిర్యాదు
హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ ఏర్పాటు చేయడంపై న్యాయవాది నరసింహారెడ్డి ఎన్నికల సంఘం(ఇసి)కు ఫిర్యాదు చేశారు. హైటెక్స్లోని నోవాటెల్ హోటల్లో నిన్న ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తన పార్టీ పేరు 'జనసేన' అని పవన్ కళ్యాణ్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఎన్నికల షెడ్యూలు విడుదల చేసిన తరువాత ఆయన పార్టీని ప్రకటించారని ఆ న్యాయవాది తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నెల 6వ తేదిన కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ను విడుదల చేసిన విషయం తెలిసిందే.
'జనసేన' పార్టీ ఆవిర్భావ సదస్సుకు, ప్రచారానికి ఎంత ఖర్చు అయిందో తెలపాలన్నారు. దీనిపై విచారణ జరపాలని నరసింహారెడ్డి ఈసీని కోరారు.