నక్కపల్లి, న్యూస్‌లైన్: పాయకరావుపేట టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి అనితపై ఉన్న వ్యతిరేకతను తొలగించేందుకు ఆమె వ్యతిరేక, అనుకూల వర్గీయుల మధ్య శనివారం జరిగిన చర్చలు విఫలమయ్యాయి. సీతారామపురం సర్పంచ్ ఉరుకుట్ల వెంకటరమణ మధ్యవర్తిత్వంతో ఆ గ్రామంలో ఒక చోట రహస్య సమావేశం జరిగింది.
ఈ సమావేశానికి సస్పెండైన పార్టీ మండల అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ సమన్వయకర్త చింతకాయల రాంబాబు, మరో 20 గ్రామాల నాయ కులు హాజరయ్యారు. విభేదాలకు స్వస్తి చెప్పి పార్టీ పటిష్టతకు, టికెట్ ఇస్తే అనిత గెలుపునకు కృషి చేయాలని మద్యవర్తి ప్రతిపాదించారు. దీనిపై అసమ్మతి నేతలు ముందు తమపై సస్పెన్షన్ ఎత్తివేస్తే కలసి పనిచేసే విషయం ఆలోచిద్దామని షరతు విధించారు.
సస్పెన్షన్ ఎత్తివే త తన పరిధిలోది కాదని, అధిష్టానం, జిల్లా అధ్యక్షుడు తీసుకోవాల్సిన నిర్ణయమని అనిత చెప్పారు. అనిత వర్గీయులు కూడా సస్పెన్షన్ ఎత్తివేతకు అంగీకరించలేదని తెలిసింది. సస్పెన్షన్ వ్యవహారం తేలకపోవడంతో ఇరువర్గాల మధ్య చర్చలు విఫలమయ్యాయి.
వైద్యుడి అండదండలు..
మరోవైపు అసమ్మతి నేతలకు ఈ నియోజకవర్గం టికెట్ ఆశిస్తున్న విశాఖకు చెందిన ఓ వైద్యు డి అండదండలున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఈయనకు సినీనటుడు బాలకృష్ణతో సత్సంబంధాలున్నాయని సమాచారం. తెరవెనక అసమ్మతిని ప్రోత్సహిస్తున్న ఆయన ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగడానికి వైద్యవృత్తికి దీర్ఘకాలిక సెలవు కోసం ప్రభుత్వానికి ధరఖాస్తు చేసినట్లు తెలి సింది. అనుమతి రాగానే పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలక పాత్ర పోషించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇప్పటికే పలు గ్రామాల్లో తన చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మెగా వైద్య శిబి రాలు, సేవా కార్యక్రమాలు చేపడుతూ గుర్తింపు కోసం యత్నిస్తున్నారు. నియోజకవర్గంలో తనకంటూ ప్రత్యేక వర్గాన్ని ఏర్పాటు చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు.
అనిత తీరు పార్టీకి నష్టం: నాయకులు
నక్కపల్లి: పాయకరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి అనితకు నక్కపల్లి మండలంలో కూడా అసమ్మతి సెగ తగిలింది. ఆమె వ్యవహారశైలి పార్టీకి నష్టం కలిగించేలా ఉందని పార్టీ సీనియర్ నాయకులు దేవవరపు కొండలరావు (గొల్ల), మండల టీడిపి అధ్యక్షుడు దేవవరపు శివ, మండల మై నార్టీ సెల్ అధ్యక్షుడు అజీమ్, తెలుగు యువత నాయకులు ముద్దా నానాజీలు ఆరోపించారు. శనివారం వారు విలేకర్లతో మాట్లాడుతూ అనిత పార్టీ నాయకులు, కార్యకర్తలను కలుపుకుని పోవడం లేదని, ఇతర పార్టీల నుంచి వ చ్చిన వారికి ప్రాధాన్యమిస్తూ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న వారిని విస్మరిస్తున్నారని విమర్శించారు. తాము పార్టీని వదిలిపెట్టే ప్రసక్తిలేదన్నారు. ముద్దా నానాజీ మాట్లాడుతూ తమకు వ్యక్తి కాదు.. పార్టీయే ముఖ్యమన్నారు. ఇటీవల పార్టీలో చేరిన వెంకటేష్ వల్ల గతంలో పార్టీకి నష్టం వాటిల్లిందని, పార్టీ ఫిరాయించి ఏడాది తర్వాత గత్యంతరం లేక మళ్లీ టీడీపీలో చేరారన్నారు. ఇప్పటికైనా అనిత పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసే వారికి ప్రాధాన్యమివ్వాలని కోరారు.
సఖ్యత చర్చలు విఫలం
Published Sun, Oct 13 2013 2:01 AM | Last Updated on Fri, Sep 1 2017 11:36 PM
Advertisement
Advertisement