
‘సాక్షి’ బ్రహ్మోత్సవ సంచికపై అభినందనలు
శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ప్రత్యేక కథనాలతో ఆదివారం ‘నమో లక్ష్మీపతే’ శీర్షికన ప్రచురితమైన ‘సాక్షి ఫన్ డే’ సంచికను సింహవాహన సేవలో సంబంధిత తిరుమల అధికారులు ఆవిష్కరించారు. టీటీడీ సాధికారిక మండలి అధ్యక్షుడు జగదీష్‌చంద్ర శర్మ, ఈవో గిరిధర్ గోపాల్, జేఈవోలు కేఎస్ శ్రీనివాసరాజు, పోలా భాస్కర్, డెప్యూటీ ఈవో చిన్నంగారి రమణ, ఆలయ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు, పీఆర్‌వో టి. రవి, ద్రవిడ వర్సిటీ పూర్వ ఉప కులపతి రవ్వా శ్రీహరిలు ‘ఫన్ డే’ సంచికను ఆవిష్కరించారు.