
రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల పేర్లు ఖరారు
న్యూఢిల్లీ: రాజ్యసభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఖరారు చేసింది. రాష్ట్ర నుంచి కాంగ్రెస్ అభ్యర్థులుగా కెవిపి రామచంద్ర రావు, ఎంఏ ఖాన్, తిక్కవరపు సుబ్బరామిరెడ్డి పేర్లను అధిష్టానం ఆమోదించింది.
ఇదిలా ఉండగా, రాష్ట్ర పార్టీ వ్యవహరాల బాధ్యుడు దిగ్విజయ్ సింగ్ కూడా అధిష్టానం రాజ్యసభ అభ్యర్థిగా ఎంపిక చేసింది. దిగ్విజయ్ సింగ్ ఈ సాయంత్రం ఏఐసీసీ అధినేత్రి సోనియా గాంధీని కలిసి తాను రాజ్యసభ టిక్కెట్ ఆశిస్తున్నట్లు చెప్పారు. దిగ్విజయ్ అభ్యర్థనను సోనియా మన్నించారు. ఆయనకు టిక్కెట్ కేటాయించారు.