విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయన నకిరేకల్, చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కె ట్ యార్డులను గురువారం ఆయన సందర్శించారు.
నకిరేకల్/చౌటుప్పల్, న్యూస్‌లైన్
కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు త్వరలో పత్తి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించేందుకు చర్యలు చేపడతామని కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ బీకే మిశ్రా తెలిపారు. విజయవాడ నుంచి హైదరాబాద్‌కు వెళ్తున్న ఆయన నకిరేకల్, చౌటుప్పల్‌లోని వ్యవసాయ మార్కె ట్ యార్డులను గురువారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయా మండలాల్లోని గ్రామాల నుంచి తెచ్చిన పత్తి శాంపిల్స్‌ను పరిశీలించారు. అనంతరం బీకే మిశ్రా మాట్లాడుతూ ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బ తిన్న పత్తి పంట నాణ్యతా ప్రమాణాలను పరిశీలించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాలలో పర్యటిస్తున్నట్లు తెలిపారు. వర్షాలతో పత్తి పంట నాణ్యత ప్రమాణాలు లోపించాయన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభిస్తే మార్కెట్లకు వచ్చే పత్తి ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ఉంటాయా అనే కోణంలో కూడా సర్వే చేస్తున్నామన్నారు. ఈ నివేదిక ను వారం రోజుల్లో కేంద్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని, తరువాత కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కొనుగోలు కేంద్రం ఏర్పాటుకు చర్యలు చేపడతామని చెప్పారు. చౌటుప్పల్‌లో జేడీఏ నర్సింహారావు మాట్లాడుతూ జిల్లాలో 3.12లక్షల హెక్టార్లలో పత్తిని సాగు చేశారని, 45 లక్షల క్వింటాళ్ల మేర పత్తి దిగుబడి వస్తుందని అంచనా వేశామని వివరించారు.
మొదటి దఫాలో రైతులు 70శాతం పత్తి తీశారని, రెండో దఫాలో పత్తి తీసే సమయంలో వర్షానికి తడిసి పోయిందని చెప్పారు. జిల్లాలో సుమారు 5లక్షల క్వింటాళ్ల పత్తి వర్షానికి తడిసి రైతులు నష్టపోయారని తెలిపారు. ఆయన వెంట సీసీఐ మార్కెట్ డైరె క్టర్ చొక్కలింగ ం, గుంటూర్ సీసీఐ బ్రాంచ్ మేనేజర్ చతుర్వేది. నల్లగొండ వ్యవసాయ మార్కెటింగ్ సహాయ సంచాలకుడు ప్రసాద్‌రావు, సీసీఐ కొనుగోలు అధికారులు పీబీ నాయుడు, చంద్రారెడ్డి, స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్లు వంటెపాక యేసురత్నం, రావుల మాధవరెడ్డి ప్రత్యేక శ్రేణి కార్యదర్శి రాములు, సూపర్ వైజర్లు పీ వెంకటేశ్వర్లు, కిరణ్, జిన్నింగ్ మిల్లు ప్రతినిధి కోటగిరి వెంకటేశ్వర్లు, ఎస్‌కె.బాబా, చంద్రారెడ్డి, వీరబాబు, ప్రవీణ్‌రెడ్డి, నర్సింహారెడ్డి తదితరులున్నారు.