లారీ ఢీకొని భార్యాభర్తల మృతి | couple died in a road accident | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొని భార్యాభర్తల మృతి

Published Tue, Jun 2 2015 8:53 PM | Last Updated on Wed, Jul 10 2019 7:55 PM

couple died in a road accident

పెళ్లకూరు(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో లారీ ఢీకొని దంపతులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. వివరాలివీ... మండలంలోని ఎగువచావలి గ్రామానికి చెందిన బడితాల సుబ్రహ్మణ్య, సుమలత దంపతులు కాకర సాగు చేస్తుంటారు. మంగళవారం రాత్రి వారు పొలం నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో సుమలత(40) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆ దంపతులకు 16 ఏళ్లలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement