Lorry collision
-
ప్రాణం తీసిన అతివేగం..
చేగుంట (తూప్రాన్)/సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: నాగ్‌పూర్ జాతీయ రహదారి రక్తసిక్తమైంది. నాగ్‌పూర్ వైపు నుంచి మేకల లోడుతో హైదరాబాద్‌కు వస్తున్న లారీ.. రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొట్టింది. శుక్రవారం తెల్లవారుజామున మెదక్ జిల్లా చేగుంట శివార్లలో జరిగిన ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు మృతిచెందారు. మరో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులేనని గుర్తించారు. గాయపడ్డవారికి హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌కు మేకలు తీసుకొస్తూ.. 44వ నంబర్ జాతీయ రహదారిపై హైదరాబాద్ వైపు వెళుతున్న ఓ దాణా లారీ శుక్రవారం తెల్లవారుజామున టైర్ పంక్చరై, రోడ్డుపై ఆగిపోయింది. అదే దారిలో నాగ్‌పూర్ వైపు నుంచి మేకల లోడ్ లారీ వస్తోంది. హైదరాబాద్‌లోని చర్లపల్లిలో ఉన్న మేకల మండీకి ఉదయమే మేకలను డెలివరీ చేయాల్సి ఉంటుంది. ఆ ఆత్రుతతోనే డ్రైవర్ వేగంగా లారీని నడిపినట్టు తెలిసింది. ఈ క్రమంలో రోడ్డుపై ఆగి ఉన్న దాణా లారీని వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ధాటికి మేకల లోడ్ లారీ క్యాబిన్ పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. అందులో కూర్చుని ఉన్న ఇద్దరు, వెనుకాల ట్రాలీలో మేకలతోపాటు ఉన్న మరో ముగ్గురు అక్కడికక్కడే చనిపోయారు. ప్రమాదం విషయం తెలిసిన పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను వెలికితీశారు. తీవ్రంగా గాయపడ్డవారిని హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అతివేగం.. నిద్రమత్తుతో! ప్రమాదం జరిగినప్పుడు మేకల లారీ గంటకు వంద కిలోమీటర్లకుపైగా వేగంతో ప్రయాణిస్తున్నట్టు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. ప్రమా దం జరిగిన ప్రదేశంలో మూల మలుపు ఉంది. దానికితోడు తెల్లవారుజామున నిద్రమత్తులో ఉన్న డ్రైవర్.. రోడ్డుపై ఆగిఉన్న దాణా లారీని సరిగా గమనించకపోవడం వల్లే ప్రమాదానికి దారితీసి ఉంటుందని చెప్తున్నారు. ప్రమాదంలో లారీలోని 80 వరకు మేకలు కూడా మృతి చెందాయి. మృతులంతా మధ్యప్రదేశ్ వాసులు ఈ ప్రమాదంలో మృత్యువాత పడిన వారంతా మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారని గుర్తించారు. క్యాబిన్లో ప్రయాణిస్తున్న మేకల వ్యాపారులు చిక్వారాజు(57), చిక్వా మనీశ్‌కుమార్ (30), వెనకాల ట్రాలీలో మేకలతోపాటు కూర్చున్న కారి్మకులు ఎండీ ఇబ్రహీం (21), ఎండీ షబ్బీర్ (48), ఎండీ జిసాన్ (21) అక్కడికక్కడే చనిపోయారు. డ్రైవర్ బుట్టాసింగ్, మేకల వ్యాపారి లాల్మణి, రమేశ్‌లాల్, మహేశ్‌లాల్, శుక్లాల్ తీవ్రంగా గాయపడ్డారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం రామాయంపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్టు తూప్రాన్ డీఎస్పీ వెంకట్‌రెడ్డి తెలిపారు. -
అన్నమయ్య: ఘోర రోడ్డు ప్రమాదం.. ఐదుగురు మృతి
సాక్షి, అన్నమయ్య: అన్నమయ్య జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పీలేరులో శనివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాద ఘటన చోటుచేసుకుంది. లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. వివరాల ప్రకారం.. పీలేరులోని ఎంజేఆర్ కాలేజీ వద్ద ఆగి ఉన్న లారీని తుఫాన్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. కాగా, తుఫాన్ వాహనం నంద్యాల నుంచి తిరువన్నమలైకు వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఇది కూడా చదవండి: ‘జయలక్ష్మి’ ఆస్తుల సీజ్‌కు రంగం సిద్ధం -
టంగుటూరు హైవేపై రోడ్డు ప్రమాదం
-
లారీ, మోపెడ్ ఢీ..చెలరేగిన మంటలు
కరీంనగర్ జిల్లా: జగిత్యాల సోమవారం జరిగిన రోడ్డుప్రమాదంలో పెనుప్రమాదం తప్పింది. పాతబస్టాండు వద్ద లారీ, ఓ మోపెడ్‌ను ఢీకొట్టింది. అదే సమయంలో మోపెడ్‌పై పెట్రోలు తీసుకెళ్తుండటంతో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. స్థానికులు అప్రమత్తమై మంటలను ఆర్పివేయడంతో ప్రమాదం తప్పింది. -
మృత్యు మలుపు
ఓ శుభ కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన ఆ కుటుంబం ఆనందం అంతలోనే ఆవిరైంది. అంతవరకూ సంతోషంగా ఉన్న వారిని చూసి విధికి కన్నుకుట్టింది. తల్లీకూతుళ్లను విగతజీవులుగా చేసి ఆ కుటుంబంలో విషాదం నింపింది. తన బిడ్డ పెద్దపెద్ద చదువులు చదవాలి, తనకు పేరు తీసుకురావాలన్న కోటి ఆశలతో కుమారుడిని హాస్టల్లో జాయిన్ చేయడానికి తీసుకువెళుతున్న ఓ వ్యక్తి ఆశలను అంతలోనే ఆ రాకాసి మలుపు చిదిమేసింది. కొమరాడలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలో ఉన్న మలుపు వద్ద ఆటోను లారీ ఢీకొనడంతో ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఆ ప్రాంతం బంధువుల, క్షతగాత్రుల రోదనలతో, పెడబొబ్బలతో దద్దరిల్లింది. పార్వతీపురం/ కొమరాడ: కొమరాడ మండలంలోని ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలోని మలుపు వద్ద బుధవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందారు. కూనేరు నుంచి పార్వతీపురం వైపు వస్తున్న ఆటోను... పార్వతీపురం నుంచి రాయగడ వైపు వెళ్తున్న లారీ ఢీ కొంది. ఈ సంఘటనలో ఆటో నుజ్జు నుజ్జు కాగా, అందులో ప్రయాణిస్తున్న 14 మందిలో ముగ్గురు మృత్యువాత పడ్డారు. 10 మందికి తీవ్రగాయాలయ్యాయి. వీరిలో ఆరుగురిని విశాఖపట్నం తరలించారు. అందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీనికి సంబంధించి స్థానికులు, క్షతగాత్రులు, వారి కుటుంబ సభ్యులు అందించిన వివరాలిలా ఉన్నాయి... కొమరాడ మండలంలోని గుమడ గ్రామానికి చెందిన డ్రైవర్ బాసంగి శ్రావణ్ తన ఆటోలో టికెట్లు ఎక్కించుకొని కూనేరు నుంచి పార్వతీపురం వైపు ప్రయాణమయ్యాడు. పార్వతీపురంలో జరుగుతున్న ఓ ఫంక్షన్‌కు హాజరయ్యేందుకు ఒడిశా రాష్ట్రం కెరడ గ్రామానికి చెందిన గెంబలి నారాయణమూర్తి కుటుంబానికి చెందిన తల్లి గెంబలి కళావతి (60), చెల్లెళ్లు గెంబలి శ్రీదేవి(25), షర్మిల, వారణాశి జానకి, బావ కృష్ణ, తమ్ముడు దినేష్‌లు వీరితో పాటు తన కొడుకును హాస్టల్ లో దించేసి, ఇంటికి తిరుగు ప్రయాణంలో భాగంగా జియ్యమ్మవలస మండలం పిప్పలభద్ర గ్రామానికి చెందిన కొప్పర రామన్నదొర కూనేరులో ఆటో ఎక్కారు. తన కొడుకు కార్తీక్‌ను కొమరాడలోని హాస్టల్లో జాయిన్ చేసేందుకు బయలుదేరిన ఉలిపిరి గ్రామానికి చెందిన ఉర్లక నాగేశ్(36), కుమారునితో పాటు కూనేరు రామభద్రపురంలో ఆటో ఎక్కాడు. తన ఇద్దరు కొడుకుల్లో పెద్దకొడుకు గొడబ జగదీష్‌ను పార్వతీపురంలో డిగ్రీ కళాశాలలో జాయిన్ చేద్దామని, అలాగే చిన్న కొడుకు దుర్గను హాస్టల్లో జాయిన్ చేద్దామని బయలుదేరిన లాభేసుకు చెందిన గొడబ లక్ష్మి కుమారులిద్దరితో వీరభద్రరాజపురం జంక్షన్లో ఆటో ఎక్కింది. దేవుకోన గ్రామానికి చెందిన కొండబోయిన శివాజీ పార్వతీపురం పనిమీద వెళ్తూ దేవుకోన జంక్షన్లో ఆటో ఎక్కారు. ఇలా మొత్తం 13 మంది ఆటోలో ప్రయాణిస్తుండగా సరిగ్గా కొమరాడ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల సమీపంలోని యూ టర్న్ మలపు వద్దకు వచ్చే సరికి ఎదురుగా వచ్చిన లారీ ఢీ కొట్టింది. ఇక్కడ ఎదురెదురుగా ప్రయాణిస్తున్న వాహనాలు దగ్గరకు వచ్చే వరకూ కనిపించవు. ఈ దుర్ఘటనలో ఆటో నుజ్జు నుజ్జుయింది. అక్కడికక్కడే ఒకరి మృతి... సంఘటన జరిగిన స్థలంలోనే కెరడ గ్రామానికి చెందిన గెంబలి శ్రీదేవి(25) అక్కడకక్కడే మృతి చెందగా, 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన జరిగిన వెంటనే స్థానికులు క్షతగాత్రులను 108 వాహనాలలో పార్వతీపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంటనే ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ జి.నాగభూషణరావుతోపాటు వైద్యాధికారులు శేషగిరి, వెంకటరావు, వాసుదేవరావు, రవి కుమార్, ప్రదీప్ కుమార్, రామచంద్రరావు తదితరులు తమ సిబ్బందితో కలిసి క్షతగాత్రులకు సేవలందించారు. పార్వతీపురం ఏఎస్పీ సిద్ధార్థ్ కౌశల్, సీఐ వి.చంద్రశేఖర్, పార్వతీపురం, కొమరాడ ఎస్సైలు వి.అశోక్ కుమార్, బి.సురేంద్రనాయుడు, సతీష్ కుమార్ తదితరులు తమ సిబ్బందితో పాటు సంఘటన స్థలం, ఏరియా ఆస్పత్రికి చేరుకొని పరీస్థితిని సమీక్షించి, క్షతగాత్రులకు సేవలందించారు. వైద్య సేవలు పొందుతూ ఒకరు...విశాఖ తరలిస్తుండగా మరొకరు మృతి... సంఘటన స్థలంలో గెంబలి శ్రీదేవి(25) అక్కడకక్కడే మృతి చెందగా, ఏరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శ్రీదేవి తల్లి గెంబలి కళావతి(60)మృతి చెందింది. తీవ్రంగా గాయపడిన ఆరుగురిని విశాఖ తరలిస్తుండగా మార్గమధ్యంలో ఉలిపిరికి చెందిన ఉర్లక నాగేశ్ (36) మృతి చెందాడు. విశాఖ తరలించిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యవర్గాలు తెలిపాయి. పగబట్టిన విధి కెరడకు చెందిన గెంబలి కుటుంబంపై విధి పగబట్టింది. ఆ కుటుంబానికి చెందిన ఆరుగురు ఆటో ఎక్కగా, అందులో ఇద్దరు మృత్యువాత పడ్డారు. ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. అందులో షర్మిల అనే బాలిక ఎటువంటి గాయాలు త గలలేదు. సంఘటన స్థలంలో క్షతగాత్రులు, మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
మహబూబ్‌నగర్ : లారీ ఢీకొని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన మహబూబ్‌నగర్ పట్టణలో గురువారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం , మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. -
లారీ ఢీకొని భార్యాభర్తల మృతి
పెళ్లకూరు(శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు): శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలంలో లారీ ఢీకొని దంపతులు మృత్యువాత పడ్డారు. ఈ ఘటన మంగళవారం రాత్రి 7 గంటల సమయంలో జరిగింది. వివరాలివీ... మండలంలోని ఎగువచావలి గ్రామానికి చెందిన బడితాల సుబ్రహ్మణ్య, సుమలత దంపతులు కాకర సాగు చేస్తుంటారు. మంగళవారం రాత్రి వారు పొలం నుంచి ఇంటికి నడిచి వెళ్తుండగా వెనుక నుంచి వచ్చిన లారీ వీరిని ఢీకొంది. ఈ ఘటనలో సుమలత(40) అక్కడికక్కడే మృతిచెందగా, తీవ్రంగా గాయపడిన సుబ్రహ్మణ్యం తిరుపతి ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఆ దంపతులకు 16 ఏళ్లలోపు కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
లారీని ఢీకొట్టిన ప్రైవేట్ బస్సు
భీమడోలు, న్యూస్‌లైన్ : జాతీయ రహదారిపై భీమడోలు రైల్వేగేటు సమీపంలో కనకదుర్గాదేవి ఆలయం వద్ద డివైడర్ దాటుతున్న లారీని వెనుక నుంచి ప్రైవేట్ బస్సు ఢీకొన్న ప్రమాదంలో సుమారు 20 మంది ప్రయూణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం తెల్లవారు జామున ఈ ఘటన జరిగింది. వివరాల్లోకి వెళ్లితే.. విజయనగరం నుంచి గుంటూరుకు శనివారం యామిని ట్రావెల్స్‌కు చెందిన బస్సు 40 మంది ప్రయూణికులతో బయల్దేరింది. వీరిలో విజయవాడ, ఏలూరు, గుంటూరు తదితర ప్రాంతాలకు చెందిన వారు ఉన్నారు. భీమడోలు సమీపంలోకి వచ్చేసరికి వైజాగ్ నుంచి పొటాష్ లోడు ద్వారకాతిరుమల వెళ్తున్న లారీ రైల్వేగేటు లోంచి వెళ్లేందుకు కనకదుర్గాదేవి ఆలయ సమీపంలో ఉన్న డివైడర్ గుండా రాంగ్ రూట్లోకి వెళ్తూ సిగ్నల్ ఇవ్వకపోవడంతో వెనుక నుంచి వచ్చిన బస్సు వేగంగా ఢీకొంది. తెల్లవారు జామున 4 గంటల సమయంలో ప్రమాదం జరగడంతో పెద్ద శబ్దం రాగా నిద్రలో ఉన్న ప్రయాణికులంతా ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. ప్రమాదంలో గుంటూరుకు చెందిన బస్సు డ్రైవర్ కె.రామిరెడ్డి క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. 20 మంది ప్రయూణికులు తీవ్రంగా గాయపడగా, ముందు సీట్లు తగిలి పలువురు గాయపడ్డారు. భీమడోలు అంబులెన్స్, నేషనల్ హైవే అంబులెన్స్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. గాయపడిన వారిలో గుంటూరు జిల్లా మడిచర్లకు చెందిన ఎ.లక్ష్మణరావు, విజయనగరానికి చెందిన పి.గోవిందరావు, శ్రీకాకుళంకు చెందిన ఎస్.కొండలరావు, ప్రకాశం జిల్లాకు చెందిన జి.రవిచంద్ర, శ్రీకాకుళంకు చెందిన ఆనంతరామయ్య, గుంటూరు జిల్లా పిడుగురాళ్లకు చెందిన జి.విష్ణు, గుంటూరుకు చెందిన పైడిరాజు, జగదాంబ తదితరులు ఉన్నారు. నేషనల్ హైవే క్రేన్ సహాయంతో లారీ, బస్సులను పక్కకు లాగారు. బస్సులో ఇరుక్కున వారిని అద్దాలు పగలుగొట్టి బయటకు తీశారు. గ్రామస్తులు, పోలీసులు అతికష్టంతో బస్సు డ్రైవర్ రామిరెడ్డిని బయటకు తీసి, ఏలూరు ఆస్పత్రికి తరలించారు. ప్రమాదం జరగడంతో రెండు వైపులా భారీగా వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ స్తంభించింది.