ప్రేమ జంట బలవన్మరణం | Couple in love suside | Sakshi
Sakshi News home page

ప్రేమ జంట బలవన్మరణం

Published Fri, Mar 13 2015 2:15 AM | Last Updated on Wed, Jul 10 2019 8:00 PM

Couple in love suside

ఇష్టం లేని పెళ్లితో పరారై వచ్చిన జంట
తిరుపతిలోని ఓ లాడ్జీలో బస
ఘటనకు ముందు తిరుమలకు వెళ్లివచ్చిన ప్రేమికులు
లాడ్జీలోనే ఇద్దరూ ఆత్మహత్య
 

తిరుపతి క్రైం: ఓ ప్రేమ జంట బలవన్మరణం చేసుకుంది. ఇష్టం లేని పెళ్లి చేసి ప్రియురాలికి దూరం         చే యడంతో ఆ యువకుడు మనస్తాపం చెందాడు. ప్రియురాలితో కలిసి తిరుపతికి వచ్చి ఇద్దరూ తిరిగిరాని లోకానికి వెళ్లారు. ఈ ఘటన తిరుపతి నగరంలో గురువారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... పశ్చిమగోదావరి జిల్లా గోపాలపురానికి చెందిన దుర్గారావు(25) అలియాస్ పండు, నల్లజర్ల మండలం అనంతపల్లెకు చెందిన దేవిశ్రీ(23) ప్రేమించుకున్నారు. అయితే ఆ యువకుడికి ఇష్టం లే కున్నా తల్లిదండ్రులు 8 నెలల క్రితం శిరీషా అనే అమ్మా యితో వివాహం చేశారు.

ఇది నచ్చని అతను నాలుగు రోజుల క్రితం తన ప్రియురాలితో కలిసి తిరుపతికి వచ్చారు. గోవిందరాజస్వామి గుడి సమీపంలో ఓ లాడ్జీలో బుధవారం ఉదయం 4 గంటల సమయంలో గది అద్దెకు తీసుకున్నారు. సాయంత్రం తిరుమల వెళ్లి గురువారం ఉదయం తిరిగి లాడ్జీకి చేరుకున్నారు. సాయంత్రం అద్దె గది ఖాళీ చేయాల్సి ఉండగా లాడ్జి మేనేజర్ ఫోన్ చేయగా పది నిమిషాల్లో రెడీ అయి వస్తామని చెప్పారు. పది నిమిషాల సమయంలో ఏం జరిగిందో తెలియదు. ఇద్దరూ మృత్యువాతపడ్డారు. చేతులు కోసుకుని దేవిశ్రీ ఫ్యాన్‌కు ఉరివేసుకోగా, దుర్గారావు బాత్రూమ్‌లో ఉరివేసుకున్నాడు. సంఘటనా స్థలంలో పండూ ఐ లవ్‌యూ.. పండూ ఐలవ్‌యూ అంటూ 124  పేజీల నోట్‌బుక్ దొరికింది. చచ్చినా, బతికినా నీతోనే అని, మరొకరితో పెళ్లి అయినా నేను నీదానినే అని దేవిశ్రీ స్పష్టంగా అం దులో రాసివుంది.

లాడ్జి సిబ్బంది గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. అప్పటికే వారిద్దరూ రక్తపు మడుగులో పడిఉన్నారు. వారి సెల్‌ఫోన్లులో నంబర్ల ఆధారంగా బంధువులకు పోలీసులు ఫోన్ చేసి ఆరా తీయగా వివరాలు తెలిశాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మెడికల్ కళాశాలకు తరలించారు. మృతుల తల్లిదండ్రులు, బంధువులు స్వగ్రామం నుంచి బయలుదేరినట్లు సమాచారం. కాగా దేవిశ్రీ కనిపించలేదని ఆమె తల్లిదండ్రులు ఈ నెల 11న నల్లజర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement