న్యాయస్థానాల సమస్యలు పరిష్కరిస్తా.. | Courts dealt with the problems | Sakshi
Sakshi News home page

న్యాయస్థానాల సమస్యలు పరిష్కరిస్తా..

Published Sun, Jul 20 2014 1:34 AM | Last Updated on Sun, Sep 2 2018 4:48 PM

న్యాయస్థానాల సమస్యలు పరిష్కరిస్తా.. - Sakshi

న్యాయస్థానాల సమస్యలు పరిష్కరిస్తా..

 శ్రీకాకుళం(లీగల్): జిల్లాలోని న్యాయస్థానాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని హైకోర్టు న్యాయమూర్తి ఎం.సీతారామమూర్తి అన్నారు. బార్ అసోసియేషన్  ఆవరణలో అధ్యక్షుడు పాడి సీతంనాయుడు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులు అందించిన వినతుల మేరకు న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయూలు క ల్పిస్తానని, భవన నిర్మాణాలు వేగవంతం, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయ నిర్వహణ, జనరేటర్ సదుపాయం కల్పనకు ఉన్నత న్యాయమూర్తితో చర్చించి సహాయం చేస్తానని తెలిపారు. జిల్లా కోర్టుల ఆవరణలో జాతీయ బ్యాంకు శాఖ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు. వినియోగదారుల ఫోరం భవన నిర్మాణానికి అనుమతులు మంజూ రుకు సహకరిస్తానని తెలి పారు.
 
 సీనియర్ న్యాయవాదుల సౌకర్యార్థం కోర్టుల పై అంతస్తులకు వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. జిల్లా జడ్జి పి.అప్పారావు మాట్లాడుతూ జిల్లాలోని న్యాయవాదులు, న్యాయమూర్తులు సుహృద్భావ వాతావరణంలో పనిచేయడం సంతోషదాయకమన్నారు. కేసుల పరిష్కారంలో జిల్లా న్యాయస్థానాలు ముందున్నాయని పేర్కొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు జస్టిస్ సీతారామమూర్తిని దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు వాన కృష్ణచంద్, తర్లాడ రాధాకృష్ణ, చమళ్ల నర్సింహమూర్తి, తర్లాడ మోహనరావు, పీవీ రమణ దయాల్‌లు ప్రసంగించారు.
 
 కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ నిరోధక కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, కుటుంబ న్యాయస్థాన న్యాయమూర్తి మల్యాద్రి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మేరీగ్రేస్ కుమారి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కరణ్‌కుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అన్నపూర్ణ, జూనియర్ సివిల్ జడ్జి పద్మ, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి వై.శ్రీనివాసరావు, మొబైల్‌కోర్టు న్యాయమూర్తి సాయిసుధ, న్యాయవాదులు పైడి వేణుగోపాల్, కంచరాన నాగభూషణరావు, ఎన్ని సూర్యారావు, సనపల హరి, జల్లు తిరుపతిరావు, గేదెల ఇందిరా ప్రసాద్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జన్నెల రవి, ప్రధాన కార్యదర్శి ఆరిక కృష్ణంరాజు, కార్యదర్శి పోడలి రాజు, మహిళా ప్రతినిధి కె.ఉషాదేవి, గ్రంథాలయ కార్యదర్శి బి.ప్రసన్నకుమార్, చీడి శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement