Seetharama Murthy
-
న్యాయ రాజధానిలో రాష్ట్ర మానవ హక్కుల కమిషన్
కర్నూలు (సెంట్రల్): రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(హెచ్ఆర్సీ) కార్యాలయం బుధవారం కర్నూలులో ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ఉదయం 10.30 గంటలకు రాష్ట్ర హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ ఎం.సీతారామమూర్తి ప్రారంభించారు. అనంతరం కార్యాలయంలో వేదపండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. జస్టిస్ ఎం.సీతారామమూర్తి తన చాంబరులో ఆశీనులవ్వగా.. జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావు, జిల్లా జడ్జి వి.రాధాకృష్ణ కృపాసాగర్, కలెక్టర్ పి.కోటేశ్వరరావు, జేసీలు ఎస్.రామ్సుందర్రెడ్డి, ఎంకేవీ శ్రీనివాసులు, ఎన్.మౌర్య, ఎస్పీ సుధీర్‌కుమార్‌రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఆ తర్వాత జ్యుడిషియల్ సభ్యుడు దండే సుబ్రమణ్యం, నాన్ జ్యుడిషియల్ సభ్యుడు జి.శ్రీనివాసరావుల చాంబర్లను కూడా ప్రారంభించారు. త్వరలోనే కర్నూలుకు హైకోర్టు.. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు సమానంగా అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో సీఎం వైఎస్ జగన్ ముందుకెళ్తున్నారని జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సుబ్బయ్య, ప్రధాన కార్యదర్శి కరీం అన్నారు. మూడు రాజధానులకు ఉన్న అన్ని ఆటంకాలను ఆయన అధిగమిస్తారని పేర్కొన్నారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుకున్న అడ్డంకులు కూడా త్వరలోనే తొలగిపోతాయన్నారు. దాదాపు 50కి పైగా జ్యూడీషియరీ కమిషన్లు న్యాయ రాజధానికి తరలివస్తాయని చెప్పారు. ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు.. కార్యక్రమం అనంతరం జస్టిస్ ఎం.సీతారామమూర్తి మీడియాతో మాట్లాడారు. మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ఇప్పటి నుంచి కర్నూలులో పనిచేస్తుందని ప్రకటించారు. మౌలిక సదుపాయాల కల్పన బాగుందన్నారు. ఈ కార్యాలయాన్ని కర్నూలులో ఏర్పాటు చేయడానికి కృషి చేసిన సీఎం వైఎస్ జగన్‌తో పాటు మంత్రులను ఆయన అభినందించారు. మానవ హక్కుల ఉల్లంఘన జరిగినట్లయితే.. ప్రతి ఒక్కరూ కమిషన్‌ను ఆశ్రయించి న్యాయం పొందాలని సూచించారు. కోవిడ్ పరిస్థితుల నేపథ్యంలో ఆన్లైన్ ద్వారా ఫిర్యాదులు స్వీకరిస్తున్నట్లు చెప్పారు. వారంలో ఒకరోజు నేరుగా ప్రజల నుంచి ఫిర్యాదులు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో బి.పుల్లయ్య, జెడ్పీ సీఈఓ వెంకటసుబ్బయ్య, కర్నూలు ఆర్డీఓ హరిప్రసాద్, దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆదిశేషునాయుడు తదితరులు పాల్గొన్నారు. -
న్యాయస్థానాల సమస్యలు పరిష్కరిస్తా..
శ్రీకాకుళం(లీగల్): జిల్లాలోని న్యాయస్థానాల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషిచేస్తానని హైకోర్టు న్యాయమూర్తి ఎం.సీతారామమూర్తి అన్నారు. బార్ అసోసియేషన్ ఆవరణలో అధ్యక్షుడు పాడి సీతంనాయుడు అధ్యక్షతన శనివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. న్యాయవాదులు అందించిన వినతుల మేరకు న్యాయస్థానాల్లో మౌలిక సదుపాయూలు క ల్పిస్తానని, భవన నిర్మాణాలు వేగవంతం, బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గ్రంథాలయ నిర్వహణ, జనరేటర్ సదుపాయం కల్పనకు ఉన్నత న్యాయమూర్తితో చర్చించి సహాయం చేస్తానని తెలిపారు. జిల్లా కోర్టుల ఆవరణలో జాతీయ బ్యాంకు శాఖ ఏర్పాటుకు అవకాశాలను పరిశీలించి వెంటనే చర్యలు తీసుకుంటానన్నారు. వినియోగదారుల ఫోరం భవన నిర్మాణానికి అనుమతులు మంజూ రుకు సహకరిస్తానని తెలి పారు. సీనియర్ న్యాయవాదుల సౌకర్యార్థం కోర్టుల పై అంతస్తులకు వెళ్లేందుకు లిఫ్ట్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నిస్తానన్నారు. జిల్లా జడ్జి పి.అప్పారావు మాట్లాడుతూ జిల్లాలోని న్యాయవాదులు, న్యాయమూర్తులు సుహృద్భావ వాతావరణంలో పనిచేయడం సంతోషదాయకమన్నారు. కేసుల పరిష్కారంలో జిల్లా న్యాయస్థానాలు ముందున్నాయని పేర్కొన్నారు. అనంతరం బార్ అసోసియేషన్ సభ్యులు జస్టిస్ సీతారామమూర్తిని దుశ్శాలువతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు వాన కృష్ణచంద్, తర్లాడ రాధాకృష్ణ, చమళ్ల నర్సింహమూర్తి, తర్లాడ మోహనరావు, పీవీ రమణ దయాల్‌లు ప్రసంగించారు. కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి సత్యశ్రీ, ఎస్సీ, ఎస్టీ నిరోధక కోర్టు న్యాయమూర్తి వెంకటేశ్వర్లు, కుటుంబ న్యాయస్థాన న్యాయమూర్తి మల్యాద్రి, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి మేరీగ్రేస్ కుమారి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి కరణ్‌కుమార్, న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి అన్నపూర్ణ, జూనియర్ సివిల్ జడ్జి పద్మ, ఎక్సైజ్ కోర్టు న్యాయమూర్తి వై.శ్రీనివాసరావు, మొబైల్‌కోర్టు న్యాయమూర్తి సాయిసుధ, న్యాయవాదులు పైడి వేణుగోపాల్, కంచరాన నాగభూషణరావు, ఎన్ని సూర్యారావు, సనపల హరి, జల్లు తిరుపతిరావు, గేదెల ఇందిరా ప్రసాద్, బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు జన్నెల రవి, ప్రధాన కార్యదర్శి ఆరిక కృష్ణంరాజు, కార్యదర్శి పోడలి రాజు, మహిళా ప్రతినిధి కె.ఉషాదేవి, గ్రంథాలయ కార్యదర్శి బి.ప్రసన్నకుమార్, చీడి శంకరనారాయణ తదితరులు పాల్గొన్నారు.