
సాక్షి, విజయవాడ: విజయవాడలో జరిగిన బోటు ప్రమాదంలో సీపీఐ జాతీయ సమితి కార్యదర్శి కె.నారాయణ అల్లుడు (భార్య అన్న కొడుకు) ప్రభు కుటుంబ సభ్యులు మృతి చెందారు. నెల్లూరు జిల్లా పొదలకూరుకు చెందిన ప్రభు ఆగిరిపల్లి మండలంలోని ఎన్‌ఆర్‌ఐ ఇంజనీరింగ్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్నారు. ప్రభు తల్లి లలితమ్మ కొడుకును చూసేందుకు వచ్చారు. లలితమ్మ కొడుకు ప్రభు, అయన భార్య హరిత (30), కుమార్తె అశ్విక (7)తో కలసి ఆదివారం విహారయాత్ర కోసం భవానీ ద్వీపం వచ్చారు.
అక్కడ నుంచి పవిత్ర సంగమంలో హారతుల్ని చూసేందుకు కోడలు, మనవరాలితో కలసి బోటు ఎక్కగా, ప్రమాదానికి గురైంది. ఆదివారం రాత్రే ప్రభు తల్లి లలితమ్మ మృతదేహం లభ్యం కాగా, సోమవారం ఉదయం భార్య హరిత మృతదేహం దొరికింది. ఆశ్విక గురించి ఇంకా సమాచారం తెలియలేదు. ప్రభు బోటు ఎక్కకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment