సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలోని పున్నమి ఘాట్‌లో సీపీఐ ఆందోళన చేపట్టింది. పవిత్ర సంగమం వద్ద జరిగిన పడవ ప్రమాదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని, ప్రమాదంపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. జాతీయ మానవ హక్కుల కమిషన్ ఈ ఘటనను సుమోటోగా స్వీకరించాలని కోరారు.
ముఖ్యమంత్రి నివాసానికి పక్కనే అనుమతి లేని పడవలు తిరుగుతుంటే అధికారులు నిద్రపోతున్నారా అని సీపీఐ నగర కార్యదర్శి శంకర్ ప్రశ్నించారు. మంత్రులే తమ బినామీలతో కృష్ణా నదిలో అక్రమంగా బోట్లను నడుపుతున్నారని ఆరోపించారు. మంత్రుల అవినీతి, పర్యాటక శాఖ అసమర్థతకు 22మంది బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment