
ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ సీపీఐ బస్సు యాత్ర
శ్రీకాకుళం : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ సీపీఐ నాయకులు చేపట్టిన బస్సు యాత్ర శనివారం మధ్యాహ్నం శ్రీకాకుళం నుంచి ప్రారంభమైంది. యాత్ర ప్రారంభానికి ముందు సీపీఐ నాయకులు చలసాని శ్రీనివాస్‌యాదవ్, రామక్రిష్ణ, ప్రభాకర్‌లతోపాటు సినీ నటుడు శివాజీ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన ద్వారా పూర్తిగా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇప్పించేంత వరకు అలుపెరుగని పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.