
లోకేశ్‌కు మంత్రి పదవా?: రాఘవులు
డాబాగార్డెన్స్ (విశాఖ దక్షిణ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు లోకేశ్‌కు ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నా మంత్రి పదవి ఇవ్వడంపై సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు బి.వి.రాఘవులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు కట్టబెట్టడాన్నీ ఆక్షేపించారు. విశాఖలోని సీపీఎం కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అవినీతిలో తెలుగుదేశం పార్టీ అగ్రగామిగా ఉందని, అవినీతిపరులకు మంత్రివర్గంలో స్థానం కల్పించడం ద్వారా ఈ విషయం మరోసారి నిరూపించుకుందన్నారు.