కృష్ణా(విజయవాడ): ఆరు విభాగాల్లో 49 మంది నిపుణులైన ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకునేందుకు సీఆర్‌డీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్లానింగ్ విభాగంలో 12, ఆర్ధికాభివృద్ధి విభాగంలో 3, లీగల్‌లో 2, కమ్యూనికేషన్ విభాగంలో 7, ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్‌లో 17, స్ట్రాటెజీ విభాగంలో 8 పోస్టులను భర్తీ చేయనున్నారు. డిప్యూటీ డెరైక్టర్, అసోసియేట్, అసిస్టెంట్ డెరైక్టర్, మేనేజర్, ప్రాజెక్టు మేనేజర్, టీమ్ లీడర్ స్థాయిలో పనిచేసేందుకు ఆయా రంగాల్లో ఇంజినీరింగ్, మాస్టర్స్ డిగ్రీతోపాటు పలు అదనపు అర్హతలు, పోస్టును బట్టి 15 నుంచి 2 సంవత్సరాల అనుభవం ఉన్న వారు సంబంధిత పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
సంవత్సరంపాటు కాంట్రాక్టు విధానంలో పనిచేసేందుకు ఈ భర్తీ చేస్తారు. అర్హత, అనుభవం ఉన్న వారు ఈ నెల 26వ తేదీ లోపు కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సివుంటుంది. పూర్తి వివరాల కోసం సీఆర్‌డీఏ వెబ్‌సైట్‌లో చూడాలని పేర్కొంది. వీటితోపాటు త్వరలో సుమారు 250 మంది ఉద్యోగాలను భర్తీ చేసుకునేందుకు సైతం నోటిఫికేషన్ వెలువడనుంది. స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ (స్పావ్) సహకారంతో సీఆర్‌డీఏ ఈ పోస్టులను భర్తీ చేసుకోనుంది.
49 పోస్టుల భర్తీకి సీఆర్‌డీఏ నోటిఫికేషన్
Published Wed, May 13 2015 11:48 PM | Last Updated on Sun, Sep 3 2017 1:58 AM
Advertisement
Advertisement