సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టు సంఘాల ఆగ్రహం
కర్నూలు (సిటీ): మీడియా స్వేచ్ఛను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్టు యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు టి.అంబన్న, ఎం.రామ్మోహన్, ఏపీయూడబ్ల్యూఎఫ్ జిల్లా అధ్యక్షుడు కేబీ శ్రీనివాసులు ఆరోపించారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజాస్వామ్య దేశంలో ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు మీడియా పనిచేస్తుందన్నారు. తమకు అనుకూలంగా పనిచేయడం లేదనే కారణంతో మీడియాపై అధికార పార్టీ కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం తగదన్నారు.
ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతున్న మీడియాను తమ గుప్పిట్లో పెట్టుకునేందుకే ఇలాంటి అప్రజాస్వామిక చర్యలకు అధికారపార్టీ పాల్పడుతోందన్నారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి.. సాక్షిటీవీ ప్రసారాలను పునరుద్ధరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా జరల్నిస్టు సంఘాల ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఉద్యమాలు చేయాల్సి వస్తుందని హెచ్చరించారు.
మీడియా స్వేచ్ఛను హరిస్తున్న ప్రభుత్వం
Published Sat, Jun 11 2016 4:09 AM | Last Updated on Fri, Nov 9 2018 5:56 PM
Advertisement