వినియోగదారులూ.. మేల్కోండి!
► వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
► కలెక్టర్ లక్ష్మీనరసింహం
శ్రీకాకుళం పాతబస్టాండ్ : వినియోగదారులకు తమ హక్కులపై సంపూర్ణ అవగాహన ఉండాలని కలెక్టర్ పి. లక్ష్మీనరసింహం అన్నారు. ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని బుధవారం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఆహార సురక్షిత అంశాలపై కల్తీ నిరోధక శాఖ ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. తాగునీరు, పాలు, కూరగాయలు తదితర అంశాల్లో కల్తీలను ఏ విధంగా ఎదుర్కోవాలన్న విషయాన్ని తెలియజేయాలని చెప్పారు. మెడికల్ దుకాణాలలో వైద్యుని చీటీ మీద మాత్రమే మందులు విక్రయించాలని తెలిపారు. కల్తీలను పరిశీ లించే అధికారులు.. చక్కగా, సకాలంలో ఈ తనిఖీలు చేయడం లేదని కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు.
జాయింట్ కలెక్టర్ కేవీఎన్ చక్రధరబాబు మాట్లాడు తూ.. సినిమా థియేటర్లకు వెళ్లేటప్పుడు బయట తినుబండారాలను తీసుకువెళ్లవచ్చని, ఈ మేరకు న్యాయస్థానం తీర్పు ఉందన్నారు. వినియోగదారులు ఆలోచించడం మొదలు పెట్టాలని, చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. కాల పట్టికలో సూచించిన మేరకు సేవలు అందకపోయినా వినియోగదారుల ఫోరంలో కేసు వేయవచ్చని తెలిపారు. జిల్లా వినియోగదారుల ఫోరం న్యాయమూర్తి ఎల్. శ్రీరామమూర్తి మాట్లాడుతూ.. వినియోగదారుల ఫోరంలో సత్వర న్యాయం లభిస్తుందన్నారు. సామాన్య వినియోగదారులను చైతన్యవంతం చేయాలని చెప్పారు. కలెక్ట ర్ కార్యాలయ న్యాయ సలహాదారు పప్పల జగన్నాథరావు మాట్లాడుతూ వినియోగదారుల చట్టం చాలా ప్రయోజనకరమైనదన్నారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖా ధికారి డాక్టర్ ఎస్.తిరుపతిరావు మాట్లాడుతూ వైద్య సేవలు పొందేవారూ వినియోగదారులేనని తెలిపారు. ప్రైవేటు ఆస్పత్రులు ధరల పట్టికను ప్రజలకు తెలిసే విధంగా ఉంచాలని చెప్పారు. జిల్లా వినియోగదారుల ఫోరం అధ్యక్షుడు బగాది రామ్మోహనరావు మాట్లాడు తూ వినియోగదారుల ఉద్యమం బలోపేతం కావాలన్నారు.
అంతకుముందు కలెక్టర్ కార్యాలయ ప్రాంగణంలో వైద్య ఆరోగ్యశాఖ ద్వారా చేపడుతున్న కార్యక్రమాలను, రైతు బజారులో ఏర్పాటు చేసిన రైపెనింగ్ చాంబర్ మోడల్‌ను, తూనికలు, కొలతల శాఖ, డ్రగ్స్ కంటోల్ శాఖ, గ్యాస్ కంపెనీల ప్రదర్శనలను అధికారులు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి జిల్లా పౌరసరఫరాల అధికారి హెచ్‌వీ జయరాం, ఫుడ్ సేఫ్టీ అధికారి జి. ప్రభాకరరావు, మార్కెటింగ్ సహాయ సంచాలకులు వైవీ శ్యామ్‌ప్రసాద్, సహాయ డ్రగ్ కంట్రోలర్ సీహెచ్ కిరణ్‌కుమార్, భారత్‌గ్యాస్ ప్రతినిధి ఆదినారాయణశాస్త్రి, హెచ్‌పీ గ్యాస్ ప్రతినిధి డి. శ్రీని వాసరావు పాల్గొన్నారు.