సాక్షి, అమరావతి: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం పెనుతుపానుగా మరే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ హెచ్చరించింది. గంటకు 11 కిలోమీటర్ల వేగంతో తీరంవైపు దూసుకువస్తున్న వాయుగుండం చెన్నైకి 910 కిలోమీటర్ల దూరంలో.. శ్రీహరికోటకు 960 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని ఆధికారులు తెలిపారు. ఈ నెల 17న మధ్యకోస్తా వద్ద తీరం దాటే అవకాశముందని అధికారులు వెల్లడించారు. ఈ తుపాన్‌కు పెథాయ్ తుపాన్‌గా నామకరణం చేశారు. (కోస్తాకు ‘పెథాయ్’ ముప్పు!)
సముద్రంలో 6 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసి పడుతున్నాయని తెలిపారు. తుపాన్ మార్పులను అనుక్షణం గమనిస్తున్నామని అన్నారు. తుపాన్ వల్ల తలెత్తే పరిస్థితులను ఎదుర్కోవడానికి అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేస్తున్నట్టు రియల్ టైమ్ గవర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్) ఆధికారులు తెలిపారు. పరిష్కారం వేదిక 1100 కాల్ సెంటర్ నుంచి తుపాన్ జాగ్రత్తల సందేశాలు జారీ చేస్తామని చెప్పారు. తుపాన్ సంబంధిత విభాగాల అధికారులు ఆర్టీజీఎస్‌లో ఉంటూ పర్యవేక్షణ చేస్తున్నారు. ఐవీఆర్ఎస్ ద్వారా 48 వేల మంది మత్స్యకారులకు ఫోన్లు పంపిణీ చేశారు. సముద్రం అల్లకల్లోలంగా ఉండడంతో చేపల వేటకు మత్స్యకారులు ఒడ్డుకు చేరుకున్నారు. తుపాన్ నేపథ్యంలో రాత్రంతా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తెరచి ఉంచాలని రాష్ట్ర ప్రభుత్వం పౌరసరఫరాల శాఖకు ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment