హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రత తగ్గింది. తన ప్రతాపాన్ని తగ్గించుకుని వాయుగుండంగా మారడంతో కోస్తాం ధ్రకు ముప్పు తప్పింది. కాగా దీని ప్రభావం వల్ల శనివారం కోస్తాంధ్రలో చెదురుముదరు వర్షాలు పడే అవకాశముంది.
నాలుగు రోజులక్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. అది శుక్రవారం ఉదయానికి తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తొలుత ప్రకటించింది. అయితే అది బలహీనపడి, వాయుగుండంగా మారింది.