kostandra
-
కోస్తాంధ్రకు భారీ వర్షసూచన
-
ఏపీలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణశాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి బుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. భారత వాతావరణ శాఖ (ఐఎండీ) సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో బలపడనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతిభారీ వర్షాలు మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో చెదురు మదురుగా తేలకపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణశాఖ ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేసింది. (కొనసాగుతున్న అల్పపీడనం) తీరంవెంబడి గంటకు 40-50 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని సముద్రం అలజడిగా ఉంటుందని, కావున మత్స్యకారులు వేటకు వెళ్ళరాదని కమిషనర్ కన్నబాబు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న మూడు రోజులు మెరుపులు, ఉరుములతో కూడిన వర్షం పడేప్పుడు పిడుగుల పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కులీలు, పశు-గొర్రెల కాపరులు చెట్ల క్రింద, చెరువుల వద్ద, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. -
వచ్చే మూడు రోజులు వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 7(బుధవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ నెల 9న కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది. ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక నివేదిక వెలువరించింది. సోమవారం నుంచి రానున్న ఐదు రోజులపాటు వాతావరణ స్థితిగతులపై అంచనాలను ఈ నివేదిక ద్వారా వెల్లడించింది. సోమవారం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
‘సీమ’పై బలంగా రుతుపవనాలు
రుతుపవనాలు,రాయలసీమ,కోస్తాంధ్ర,sycylon,rayalaseema,kostandra సాక్షి, విశాఖపట్నం: రాయలసీమపై రుతుపవనాలు బలంగా ఉన్నాయి. విదర్భ నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమలపై అల్పపీడనద్రోణి స్థిరంగా కొనసాగుతోంది. వీటి ప్రభావంతో రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాంధ్రల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) మంగళవారం రాత్రి విడుదల చేసిన నివేదికలో తెలిపింది. అదే సమయంలో రాయలసీమల్లోని కర్నూలు, కడప, చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఇప్పటికే రాయలసీమలో భారీగాను, కోస్తాంధ్రలో ఓ మోస్తరు గాను వానలు కురుస్తున్నాయి. గడచిన 24 గంటల్లో పాలసముద్రంలో 11, నల్లమడలో 7, హిందుపూర్, కుప్పం, గోరంట్ల, పెనుకొండలలో 6, లేపాక్షి, రాజుపాలెం, కోయిలకుంట్లలో 5, అమలాపురం, దువ్వూరు, జమ్మలమడుగు, ధర్మవరం, పుంగనూరు, చాపాడుల్లో 4, మంగళగిరి, టెక్కలి, వి.రామచంద్రపురం, కొండాపురం, ఓబులచెరువు, తిరుపతి, చిలమత్తూరు, బత్తలపల్లె, వేంపల్లె, సింగనమల, పలమనేరు, ముద్దనూరు, వేంపల్లె, బనగానపల్లె, అవుకుల్లో 3 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదయింది. -
కోస్తాంధ్రకు వర్ష సూచన
-
కోస్తాంధ్రకు వర్ష సూచన
హైదరాబాద్: బంగాళాఖాతంలో ఏర్పడిన తుపాను తీవ్రత తగ్గింది. తన ప్రతాపాన్ని తగ్గించుకుని వాయుగుండంగా మారడంతో కోస్తాం ధ్రకు ముప్పు తప్పింది. కాగా దీని ప్రభావం వల్ల శనివారం కోస్తాంధ్రలో చెదురుముదరు వర్షాలు పడే అవకాశముంది. నాలుగు రోజులక్రితం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది. అది శుక్రవారం ఉదయానికి తుపానుగా బలపడుతుందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) తొలుత ప్రకటించింది. అయితే అది బలహీనపడి, వాయుగుండంగా మారింది.