వచ్చే మూడు రోజులు వర్షాలు
సాక్షి, న్యూఢిల్లీ: ఈ నెల 7(బుధవారం) నుంచి మూడు రోజుల పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. అలాగే, ఈ నెల 9న కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురవనున్నాయని తెలిపింది.
ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక నివేదిక వెలువరించింది. సోమవారం నుంచి రానున్న ఐదు రోజులపాటు వాతావరణ స్థితిగతులపై అంచనాలను ఈ నివేదిక ద్వారా వెల్లడించింది. సోమవారం తెలంగాణ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది.