చిత్తూరు: జిల్లాలోని పీలేరులో కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం దళితులపై దౌర్జన్యానికి దిగారు. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారిడికి ఓట్లేసినందుకు దళితులపై వేటకొడవళ్లతో దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మొరంరెడ్డిగారిపల్లె దళితవాడలో చోటుచేసుకుంది. ఈ దాడిలో నలుగురికి తీవ్రాగాయాలయ్యాయి. ఆ ప్రాంత కాంగ్రెస్ నేత బాలం నరేంద్రరెడ్డి నేతృత్వంలో ఈ దాడి జరిగినట్టు సమాచారం. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.