Dalits attack
-
చంద్రబాబు దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా?
సాక్షి, అమరావతి : బషీర్ బాగ్ కాల్పుల్లో అనేక మందిని పొట్టన పెట్టుకున్న ఘనత చంద్రబాబుకే దక్కుతుందని బాపట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. దళితులను అడ్డుపెట్టుకొని చంద్రబాబు కుట్రలు చేస్తున్నాడని విమర్శించాడు. శుక్రవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఎంపీ మాట్లాడుతూ.. మూడు రాజధానులకు మద్దతుగా వచ్చిన వారిని అడ్డుపెట్టుకొని బాబు దాడికి దిగుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడు కూడా ఒక దళిత ఎంపీపై రాడ్లతో దాడికి దిగితే చంద్రబాబు ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. అమరావతి రైతులకు బేడీలు వేశారంటూ చంద్రబాబు మాట్లాడుతున్నారు. ఆనాడు అసైన్మెంట్ భూముల రైతులపై చంద్రబాబు చేసిన దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా అని అడిగారు. తప్పు ఎక్కడ జరిగినా తప్పే కానీ వాళ్లని అమరావతి రైతులని బాబు నానా యాగీ చేస్తున్నారన్నారు. చదవండి: నాపై ఐదుసార్లు దాడికి యత్నించారు ‘ప్రభుత్వం ఎదో చేస్తుందంటూ చంద్రబాబు దళిత కార్డ్ ఉపయోగిస్తున్నారు. ఇది దళితుల ప్రభుత్వం... దళిత జాతిని అడ్డుపెట్టుకుని ఏదో చేయాలని ప్రయత్నం చేయొద్దు. రైతులకు బేడీలు వేశారని తెలిసింది. అన్యాయం అనిపించి వెంటనే వాళ్ళని సస్పెండ్ చేశాం. కోట్లాది రూపాయల లబ్ది మీ బంధువులకు ఇచ్చి ఇప్పుడు ఉద్యమం అంటే దళితులని వాడుకుంటున్నారు. లబ్ధి వాళ్ళకి.. పోరాటం మనకా..? మీ ఇద్దరిని ప్రజలు ఎప్పుడో నడిరోడ్డుపై నిలబెట్టారు. ముందు ఆ విషయం తెలుసుకుని లోకేష్ మాట్లాడితే మంచిది. రియల్ ఎస్టేట్ తప్ప అమరావతిలో ఏమన్నా జరిగిందా. అక్రమం జరిగింది అంటే నిరూపించు అన్నావు. విచారణ వేస్తే మళ్లీ కోర్టులకు వెళ్ళావు. దళితులు బాగుపడకూడదు అనేది చంద్రబాబు నైజం. మూడు రాజధానుల ఆందోళనకారులను అడ్డుకోవడానికి నీ సామాజిక వర్గం వ్యక్తులను ఎందుకు పంపలేదు. దళిత సోదరులు చంద్రబాబు కుట్రలను తెలుసుకోవాలి’. అని హితవు పలికారు. చదవండి: ‘ఆయన చెప్పినట్లు ఇక్కడ జరగవు’ -
చంద్రబాబు దుర్మార్గాలను ఎప్పుడైనా ప్రశ్నించారా?
-
ఆ ఘటనపై కేసీఆర్ ఏం చెబుతారు?: రచనా రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికే ‘తెలంగాణ జన సమితి’ ఆవిర్భవించిందని అడ్వకేట్ రచనా రెడ్డి తెలిపారు. ఆమె బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సామాజిక న్యాయమే జన సమితి లక్ష్యమని స్పష్టం చేశారు. మరో వైపు.. దేశంలో దళితులపై జరుగుతున్న దాడులను ముఖ్యమంత్రి కేసీఆర్ ఖండించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టంపై మాట్లాడిన కేసీఆర్.. నేరెళ్ల దళితులపై ఇసుక మాఫియా లారీలు ఎక్కించి చంపిన ఘటనపై ఏం సమధానం చెబుతారని ప్రశ్నించారు. ఆయన మాటలకు, చేతలకు పొంతన ఉండదని ఆమె ఎద్దేవా చేశారు. కాగా, సిరిసిల్ల జిల్లా నేరెళ్ల, రామచంద్రాపురం గ్రామాలకు చెందిన 8 మంది దళితులు ఇసుక మాఫియాపై ప్రశ్నించినందుకు పోలీసులు అమానుషంగా వారిపై దాడి చేసిన అంశం రాష్ట్రంలో వివాదస్పదమైన విషయం తెలిసిందే. ఈ ఘటనకు బాధ్యులైన వారిని జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కేటీఆర్ రక్షిస్తున్నారని అప్పట్లో తీవ్ర విమర్శలు కూడా వచ్చాయి. -
దళితులపై వేటకొడవళ్లతో దాడి
చిత్తూరు: జిల్లాలోని పీలేరులో కాంగ్రెస్ కార్యకర్తలు గురువారం దళితులపై దౌర్జన్యానికి దిగారు. సర్పంచ్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మద్దతుదారిడికి ఓట్లేసినందుకు దళితులపై వేటకొడవళ్లతో దాడికి దిగినట్టు తెలుస్తోంది. ఈ ఘటన మొరంరెడ్డిగారిపల్లె దళితవాడలో చోటుచేసుకుంది. ఈ దాడిలో నలుగురికి తీవ్రాగాయాలయ్యాయి. ఆ ప్రాంత కాంగ్రెస్ నేత బాలం నరేంద్రరెడ్డి నేతృత్వంలో ఈ దాడి జరిగినట్టు సమాచారం. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం.