శ్రీశైలం, న్యూస్‌లైన్:
శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఆదివారం విజయదశమి పర్వదినాన శ్రీభ్రమరాంబా మల్లికార్జున స్వామివార్ల ఆలయప్రాంగ ణంలో వైభవంగా శమీ పూజలు నిర్వహించారు. అలంకార మండపంలో అమ్మవారిని సిద్ధిదాయినిగా అలంకరించి, స్వామి అమ్మవార్ల ఉత్సవమూర్తులను నందివాహనంపై అధిష్టించి విశేష వాహన పూజలు నిర్వహించారు. ఆదివారం నవమి ఘడియలు ముగిసిన వెంటనే విజయద శమి ప్రారంభం కావడంతో దసరా పండుగను దేవస్థానం ఆదివారమే నిర్వహించింది. కాగా ప్రభుత్వ సెలవు దినం సోమవారం కావడంతో రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు అధిక సంఖ్యలో శ్రీశైలం చేరుకున్నారు.
ఆలయప్రాంగణం భక్తులతో కిటకిటలాడుతూ కనిపించింది. ఉత్సవంలో భాగంగా నందివాహనాధీశులైన స్వామిఅమ్మవార్ల ఉత్సవమూర్తులను ఊరేగిస్తూ ఆలయప్రాంగణంలోని శమి(జమ్మి) వృక్షం వద్దకు చేర్చారు. జమ్మిచెట్టుకు వేదపండితులు, అర్చకులు శమిపూజలు చేశారు. కార్యక్రమంలో ఈఓ చంద్రశేఖర ఆజాద్, ఆలయ ఏఈఓ రాజశేఖర్, కేశవులు, హార్టికల్చరిస్ట్ ఏడీ ఈశ్వరరెడ్డి, పర్యవేక్షకులు మల్లికార్జునరెడ్డి, నాగభూషణం, హరిదాస్, శ్రీశైలప్రభ ఎడిటర్ డాక్టర్ అనిల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
ద‘శమి’ పూజ
Published Mon, Oct 14 2013 2:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:38 PM
Advertisement