స్టేషన్ మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: ఎదిగివచ్చిన కూతురు తన కళ్లముందే అంతుచిక్కని వ్యాధితో ని త్యం నరకం అనుభవిస్తుంటే ఆ తండ్రి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కూతురును బతికించుకునేందుకు ప డరాని కష్టాలు పడుతున్నాడు. వనపర్తి పట్టణం బం డారునగర్‌కు చెందిన మఖ్బూల్‌అలీ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉంది. రెండేళ్ల క్రితం కూతురు సమీనాబేగం(13) ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడిపోయింది. మొదట వైద్యులకు చూపించగా..ఆమె ఆరోగ్యం సా ధారణంగానే ఉంది. ఆ తరువాత కూతురు ఆరోగ్యం క్షీణించడం ఆరంభమై కదల్లేక మంచానికే పరి మితమైంది.
వైద్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరి గారు. చివరికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆ స్పత్రి వైద్యులు సమీనాకు వైద్యపరీక్షలు ని ర్వహించి చాలా అరుదుగా వచ్చే ఎస్‌ఎస్‌పీఈ వ్యాధి బారిన పడిందని నిర్ధారించా రు. ఏడేళ్లపాటు మందులు వాడితే వ్యాధి కొంతన యం కావచ్చని, లేకపోతే జీవితాంతం ఇలాగే పడిఉండాల్సి వస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. వ్యా ధికి సరైన చికిత్స లేదని, మందులతోనే జీవితకాలా న్ని పొడగించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు మఖ్బూల్‌అలీ తెలిపాడు. వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు తన కూతురు వైద్యం కోసం నాలుగులక్షలు ఖ ర్చుచేశానని, ప్రతినెలా మందులకు ఏడువేలు ఖర్చుచేయాలని వస్తుందని వాపోయాడు.
తానే బతలేని పరిస్థితుల్లో కూతురు బతికించడం కష్టంగా మారిం దని కన్నీటిపర్యంతమయ్యాడు. రెండు రోజుల క్రితం కూతురును అతికష్టం మీద జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి ఆర్థికసహాయం చేయాలని కలెక్టర్‌కు వి జ్ఞప్తి చేయగా, ఆయన తక్షణమే స్పందించి వీల్‌చైర్ సమకూర్చారని తెలిపాడు. బుధవారం స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏ ర్పాటుచేసి తన ధీనగాథను వివరించాడు. దాతలు ముందుకొచ్చి తన కూతురు ప్రాణాలను కాపాడాల ని ఆయన వేడుకుంటున్నాడు. ఆర్థికసహాయం చేయదలచిన వారు సెల్: 99639 79747, 94413 67086ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.
క్షణమొక యుగంగా..!
Published Thu, Sep 5 2013 6:33 AM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement
Advertisement