private driver
-
ప్రైవేట్ కండక్టర్‌పై కేసు నమోదు
సాక్షి, మధిర(ఖమ్మం) : టీఎస్ ఆర్టీసీ మధిర డిపోలో ప్రైవేటు కండక్టర్‌గా పనిచేస్తున్న ఓ వ్యక్తి బస్సు టికెట్లను విక్రయించగా వచ్చిన సొమ్మును స్వాహా చేశాడు. మండల పరిధిలోని మడుపల్లి గ్రామానికి చెందిన పిల్లి శేఖర్‌బాబు మధిర డిపోలో ప్రైవేటు కండక్టర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన హైదరాబాద్ వెళ్లే బస్సులో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఈ క్రమంలో ఈ నెల 7న డిపోలో టికెట్ల విక్రయానికి సంబంధించిన డబ్బులను జమచేసి బయటకు వస్తుండగా పోలీసులు సాధారణ తనిఖీలు చేశారు. అయితే రూ.21,900 విలువచేసే టికెట్లు ఆయన వద్ద అక్రమంగా ఉన్నట్లు తేలింది. వాటిలో రూ.16,626 విలువచేసే టికెట్లను విక్రయించినట్లు పోలీసులు గుర్తించారు. రూ.50 వేల విలువచేసే టికెట్లు మూడు బ్లాకులు, రూ.24 విలువచేసే టికెట్లు రెండు బ్లాకులు, రూ.21 విలువచేసే టికెట్లు ఒక బ్లాకు శేఖర్‌బాబు వద్ద అక్రమంగా ఉంచుకున్నాడు. ఒక్కో బ్లాకులో 100 టికెట్లు ఉంటాయి. అక్టోబర్ 11నుంచి ప్రయాణికులకు టికెట్లు జారీ చేయాలని డిపో అధికారులకు ఉత్తర్వులు వచ్చాయి. దీంతో అప్పటినుంచి ప్రైవేటు కండక్టర్ల వద్ద పోలీసులు సాధారణ తనిఖీలు చేస్తున్నారు. దీనిలో భాగంగా ఈనెల 7న శేఖర్‌బాబును తనిఖీచేయగా ఈ డబ్బులు స్వాహా చేసినట్లు గుర్తించారు. ఈ విషయంపై శేఖర్‌బాబుపై మధిర టౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. మధిర డిపో ఆదాయం రోజుకు రూ.7.85లక్షలు లక్ష్యం కాగా కనీసం రూ.4లక్షల ఆదాయంకూడా రావడంలేదు. ప్రయాణికుల రాకపోకలు తగ్గడంతోపాటు కొంతమంది ప్రైవేటు కండక్టర్ల చేతివాటంతో డిపోకు రావాలి్సన ఆదాయం తగ్గుతుందని పలువురు ఆరోపిస్తున్నారు. గతంలో కూడా ఒకరిద్దరి కండక్టర్ల వద్ద డబ్బులు ఎక్కువగా ఉండటాన్ని గమనించి వారిని హెచ్చరించి వదిలేసినట్లు తెలిసింది. దీనిపై డిపో మేనేజర్ జీవీఎస్ నారాయణను వివరణ కోరగా.. డిపోలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు వేర్వేరు శాఖలకు సంబంధించినవారు కావడంతో గందరగోళం నెలకొంటోందని అన్నారు. కండక్టర్లకు టికెట్లు బ్లాకులు ఇచ్చేటప్పుడు మర్చిపోవడంకానీ లేదా ఈ టికెట్ బ్లాకులను అతను చోరీ చేయడంకానీ జరిగి ఉండవచ్చని తెలిపారు. -
గుండెపోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి
అఫ్జల్‌గంజ్: బస్సు నడుపుతూ గుండె పోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి చెందిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్స్పెక్టర్ జ్ఞానేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవరకొండకు చెందిన యాదయ్య (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అతను హైదరాబాద్ డిపో1లో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీలో ఉన్న అతను చాదర్‌ఘాట్ సాయిబాబా గుడి ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. దీనిని గుర్తించి కండక్టర్ 108కి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. -
బండ్లగూడ డిపో వద్ద ఉద్రిక్తత
-
క్షణమొక యుగంగా..!
స్టేషన్ మహబూబ్‌నగర్, న్యూస్‌లైన్: ఎదిగివచ్చిన కూతురు తన కళ్లముందే అంతుచిక్కని వ్యాధితో ని త్యం నరకం అనుభవిస్తుంటే ఆ తండ్రి ప్రాణం తల్లడిల్లిపోతుంది. కూతురును బతికించుకునేందుకు ప డరాని కష్టాలు పడుతున్నాడు. వనపర్తి పట్టణం బం డారునగర్కు చెందిన మఖ్బూల్అలీ ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. ఆయనకు ఇద్దరు కొడుకులు, కూతురు ఉంది. రెండేళ్ల క్రితం కూతురు సమీనాబేగం(13) ఉన్నట్టుండి కళ్లు తిరిగి కిందపడిపోయింది. మొదట వైద్యులకు చూపించగా..ఆమె ఆరోగ్యం సా ధారణంగానే ఉంది. ఆ తరువాత కూతురు ఆరోగ్యం క్షీణించడం ఆరంభమై కదల్లేక మంచానికే పరి మితమైంది. వైద్యం కోసం ఎన్నో ఆస్పత్రులు తిరి గారు. చివరికి హైదరాబాద్‌లోని ఓ కార్పొరేట్ ఆ స్పత్రి వైద్యులు సమీనాకు వైద్యపరీక్షలు ని ర్వహించి చాలా అరుదుగా వచ్చే ఎస్ఎస్పీఈ వ్యాధి బారిన పడిందని నిర్ధారించా రు. ఏడేళ్లపాటు మందులు వాడితే వ్యాధి కొంతన యం కావచ్చని, లేకపోతే జీవితాంతం ఇలాగే పడిఉండాల్సి వస్తుందని వైద్యులు తేల్చిచెప్పారు. వ్యా ధికి సరైన చికిత్స లేదని, మందులతోనే జీవితకాలా న్ని పొడగించాల్సి ఉంటుందని వైద్యులు చెప్పినట్లు మఖ్బూల్అలీ తెలిపాడు. వివిధ ఆస్పత్రుల్లో ఇప్పటివరకు తన కూతురు వైద్యం కోసం నాలుగులక్షలు ఖ ర్చుచేశానని, ప్రతినెలా మందులకు ఏడువేలు ఖర్చుచేయాలని వస్తుందని వాపోయాడు. తానే బతలేని పరిస్థితుల్లో కూతురు బతికించడం కష్టంగా మారిం దని కన్నీటిపర్యంతమయ్యాడు. రెండు రోజుల క్రితం కూతురును అతికష్టం మీద జిల్లా కేంద్రానికి తీసుకొచ్చి ఆర్థికసహాయం చేయాలని కలెక్టర్‌కు వి జ్ఞప్తి చేయగా, ఆయన తక్షణమే స్పందించి వీల్‌చైర్ సమకూర్చారని తెలిపాడు. బుధవారం స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరుల సమావేశం ఏ ర్పాటుచేసి తన ధీనగాథను వివరించాడు. దాతలు ముందుకొచ్చి తన కూతురు ప్రాణాలను కాపాడాల ని ఆయన వేడుకుంటున్నాడు. ఆర్థికసహాయం చేయదలచిన వారు సెల్: 99639 79747, 94413 67086ను సంప్రదించాలని విజ్ఞప్తి చేస్తున్నాడు.