
అఫ్జల్‌గంజ్: బస్సు నడుపుతూ గుండె పోటుతో తాత్కాలిక డ్రైవర్ మృతి చెందిన సంఘటన అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇన్‌స్పెక్టర్ జ్ఞానేశ్వర్ రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దేవరకొండకు చెందిన యాదయ్య (45) ట్రాక్టర్ డ్రైవర్‌గా పని చేసేవాడు. ఆర్టీసీ కార్మికులు సమ్మె నేపథ్యంలో అతను హైదరాబాద్ డిపో1లో తాత్కాలిక డ్రైవర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆదివారం సాయంత్రం డ్యూటీలో ఉన్న అతను చాదర్‌ఘాట్ సాయిబాబా గుడి ప్రాంతంలో గుండెపోటు రావడంతో కుప్పకూలాడు. దీనిని గుర్తించి కండక్టర్ 108కి సమాచారం అందించాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అతడిని పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. సోమవారం మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
Comments
Please login to add a commentAdd a comment