ఏలూరు:తాంబూలం ఇచ్చేశాం.. తన్నుకు చావండి.. అన్నట్టుగా తయూరైంది పంట రుణాల మాఫీ వ్యవహారం. రుణ విముక్తి పత్రాలు పంపిణీ చేసేందుకంటూ జిల్లాలో ఈనెల 11 నుంచి నిర్వహించిన రైతు సాధికార సదస్సులు బుధవారంతో ముగిశాయి. ప్రభుత్వం అట్టహాసంగా నిర్వహించిన ఈ కార్యక్రమం కాస్తా వికటించింది. సదస్సు నిర్వహించిన ప్రతిచోటా ప్రజాప్రతినిధులు, అధికారులు రైతుల నుంచి నిరసనలు, నిలదీతలను ఎదుర్కోవాల్సి వచ్చింది. రైతుల ఖాతాల్లో సొమ్ములు జమ చేయకుండా.. రుణ విముక్తి పత్రాలు ఇవ్వడమేంటని రైతులు ఆగ్రహోదగ్రులయ్యూరు. ప్రతి గ్రామంలో వందలు, వేల సంఖ్యలో రుణాలు తీసుకున్న రైతులుంటే పదుల సంఖ్యలో అయినా రుణ విముక్తి పత్రాలు జారీ చేయకపోవడం విమర్శల పాలైంది. మరోవైపు రుణమాఫీ జాబితాలు తప్పుల తడకగా ఉండటం రైతుల ఆశల్ని నీరుగార్చింది.
సవ్యంగా సాగితే ఒట్టు
జిల్లాలో నిర్వహించిన రైతు సాధికార సదస్సులు ఎక్కడా ప్రశాంతంగా సాగలేదు. చాలాచోట్ల రైతులు అడ్డుకోవడంతో సదస్సులు నిర్వహించకుండానే అధికారులు వెనుదిరగాల్సి వచ్చింది. పెరవలి మండలం ముక్కామల సహకార సంఘం నుంచి 550 మంది, ఆంధ్రాబ్యాంకు నుంచి 600 మంది రైతులు పంట రుణాలు తీసుకోగా, కేవలం 8 మందికే రుణాలు మాఫీ అయ్యూయి. దీనిని నిరసిస్తూ రైతులు గ్రామంలో సదస్సు నిర్వహించకుండా అడ్డుకున్నారు. రుణమాఫీ చేయకుండా సదస్సులా అంటూ ఆవేదన వెళ్లగక్కారు. ముక్కామలలో ఆంధ్రాబ్యాంకు శాఖకు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. ఉండి మండలం యండగండి, కోలమూరు గ్రామాలకు సంబంధిం చిన జాబితాల్లో అర్హత కలిగిన రైతుల్లో చాలామంది పేర్లు కనిపించలేదు.
దీంతో అక్కడి రైతులు అధికారులపై ఘర్షణకు దిగారు. కొవ్వూరు మండలం పశివేదల బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ఈ నెల 15న ముట్టడించిన రైతులు ధర్నా చేశారు. జాబితాల్లో అందరి పేర్లూ లేకపోవడం, జాబితాల్లో ఉన్న వివరాల్లోనూ తప్పులు దొర్లడం, పంట రుణ ం తీసుకుంటే ఇతర అవసరాలకు తీసుకున్నట్టుగా నమోదు కావడంతో రైతులు విరుచుకుపడ్డారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఆధార్, రేషన్‌కార్డుల నకళ్లు ఇచ్చినా వివరాలను సక్రమంగా నమోదు చేయకపోవడంతో రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏలూరు మండలం చాటపర్రు కెనరా బ్యాంకు నుంచి 2,500 మంది రైతులు, కౌలు రైతులు రుణాలు తీసుకోగా, వారిలో కేవలం 350 మందిని మాత్రమే రుణమాఫీ పరిధిలోకి తీసుకురావడంతో అక్కడి రైతులు తహసిల్దార్‌ను నిలదీశారు.
అరకొర మాఫీకి ఆర్భాటం
ప్రతి నియోజకవర్గంలో టీడీపీ నేతలు, ప్రజాప్రతి నిధులు ఆర్భాటాలకు పోయూరు. రుణమాఫీ వల్ల అందరి రైతులకూ ప్రయోజనం చేకూరిందని, కోట్లాది రూపాయల్ని మాఫీ చేశామని గొప్పలు పో యూరు. రైతులు నిరసనల్ని హోరెత్తించినా ప్రజాప్రతినిధులు మాత్రం లేనిది ఉన్నట్టుగా చెప్పుకొచ్చారు.
కౌలు రైతులకు అరకొరే
జిల్లాలో 2 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారు. ప్రభుత్వం ప్రకటించిన రూ.50 వేల లోపు రుణమాఫీ కౌలు రైతుల్లో కనీసం 20 శాతం మందికైనా వర్తించలేదు. దీంతో వారు మనోవేదనకు గురవుతున్నారు.
సమస్యలుంటే
ఫోన్ చేయండి
జిల్లాలోని 901 గ్రామాల్లో రైతు సాధికార సదస్సులు నిర్వహించి రుణ విముక్తి పత్రాలను పంపిణీ చేశాం. ఆధార్, రేషన్‌కార్డులు సమర్పించినా జాబితాల్లో వచ్చిన తప్పుల సవరణకు మం డల స్థాయిలో కమిటీలు వేశాం. బ్యాంకు మేనేజర్, తహసిల్దార్, మండల వ్యవసాయాధికారి ఇందులో ఉంటారు. జనవరి 8వరకు వీటిని సవరించి తుది జాబితాలను తయారు చేస్తాం. ఈ విషయంలో ఏవైనా సమస్యలుంటే రైతులు టోల్ ఫ్రీ నంబర్ 1100-1800-425-4440కు ఫోన్ చేసి పరిష్కరించుకోవచ్చు.
- వై.సారుు లక్ష్మీశ్వరి, జారుుంట్ డెరైక్టర్; వ్యవసాయ శాఖ
అంతా తప్పుల తడకే
రైతు సాధికార సదస్సుల ద్వారా రుణమాఫీ అయ్యే రైతులకు ఏ మాత్రం న్యాయం జరగలేదు. జాబితాల్లో తప్పులు దొర్లడంతో రైతులు, కౌలు రైతులు తీవ్ర ఆందోళనతో కొట్టుమిట్టాడుతున్నారు. స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ విధానం వల్ల రైతుకు ఏ విధంగానూ మేలు జరగలేదు. రూ.50 వేలకు అదనంగా ఒక్క రూపాయి ఉన్నా.. దానిని 20 శాతం రుణమాఫీ కిందకు తీసుకురావడం దారుణం. ఎన్నికల్లో ఇచ్చిన హామీకి అనుగుణంగా రైతులందరినీ ఆదుకోవాలి
- బి.బలరాం, కార్యదర్శి, ఏపీ రైతు సంఘం
కౌలు రైతులకు న్యాయం జరగలేదు
రూ.50 వేల లోపు రుణమాఫీలో కౌలు రైతులకు ఎక్కడా న్యాయం జరగలేదు. ఎటువంటి పత్రాలు లేకపోయినా రుణమాఫీ చేయాల్సి ఉండగా, భూ యజమానులకు చెందటం శోచనీయం. జిల్లాలో దాదాపుగా లక్షమందిపైగా కౌలు రైతులు రుణం తీసుకున్నా పది శాతం మందికైనా మాఫీ కాలేదు.
- కె.శ్రీనివాస్, అధ్యక్షుడు, ఏపీ కౌలు రైతు సంఘం
ఏమిటో.. ఈ మాయ
Published Thu, Dec 18 2014 2:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement