ఎల్లారెడ్డి టౌన్, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని బీసీ బాలికల వసతి గృహంలో గురువారం విద్యార్థులకోసం కుళ్లిన వంకాయలతో చేసిన కూర, ఉడకని అన్నం సిద్ధం చేశారు. దీంతో విద్యార్థులు ఆందోళనకు దిగారు. వివరాలిలా ఉన్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జెండాను సరిగా ఆవిష్కరించారో లేదో పరిశీలించడానికి విద్యార్థి సంఘాల నాయకులు బాలికల హాస్టల్ కు వచ్చారు. రంగు వెలసిన కాగితాలను అతికించడం, జెండా రెపరెపలాడకుండా కర్రకు అతుక్కుపోయి ఉండడంపై వారు హాస్టల్ సిబ్బందిని ప్రశ్నించారు. జెండాను ఆవిష్కరించిన వెంటనే వార్డెన్ విజయలక్ష్మి వెళ్లిపోయారని సిబ్బంది చెప్పడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులకోసం తయారు చేసిన భోజనాన్ని పరిశీలించి విస్మయం వ్యక్తం చేశారు.
స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా హాస్టల్ విద్యార్థులకు వెజ్‌బిర్యాని, పాయసం వడ్డించాల్సి ఉంది. అయితే ఉడకని అన్నం, కుళ్లిన కూరగాయలతో చేసిన కూరను గమనించి వెంటనే తహశీల్దార్‌కు సమాచారం అందించారు. ఆయన హాస్టల్‌కు వచ్చి సిబ్బంది వివరణ తీసుకున్నారు. కలెక్టర్‌కు నివేదిక పంపిస్తామని తెలిపారు. ఆందోళనలో విద్యార్థి సంఘాల నాయకులు విద్యాసాగర్, సంతోష్, మహేశ్, ప్రవీణ్, ఓంకార్ తదితరులు పాల్గొన్నారు.
కుళ్లిన కూరగాయలతో విందు
Published Fri, Aug 16 2013 4:48 AM | Last Updated on Fri, Sep 1 2017 9:51 PM
Advertisement