11 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్ | DEd councelling will start from November 11 | Sakshi
Sakshi News home page

11 నుంచి డీఎడ్ కౌన్సెలింగ్

Published Fri, Nov 1 2013 1:13 AM | Last Updated on Sat, Sep 2 2017 12:10 AM

DEd councelling will start from November 11

షెడ్యూలు జారీ చేసిన విద్యాశాఖ
 11 నుంచి 14 వరకూ వెబ్ ఆప్షన్లు, 19న సీట్ల కేటాయింపు
 27న తరగతులు ప్రారంభం
 డిసెంబర్ 2 నుంచి రెండోదశ, 27 నుంచి చివరి దశ కౌన్సెలింగ్  

 
 సాక్షి, హైదరాబాద్: డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీఎడ్) కోర్సులో ప్రవేశాల కోసం విద్యాశాఖ ఎట్టకేలకు గురువారం షెడ్యూలు జారీ చేసింది. మొదటి దశ కౌన్సెలింగ్‌ను ఈ నెల 11 నుంచి చేపట్టనున్నట్లు ఈ మేరకు డైట్‌సెట్ (డీఈఈసెట్) చైర్మన్ డాక్టర్ జి.వాణీమోహన్, కన్వీనర్ ఆర్.సురేందర్‌రెడ్డి వెల్లడించారు. కళాశాలల జాబితా, ర్యాంకుల వారీ వివరాలు, ప్రవేశాలకు సంబంధించిన పూర్తి సమాచారం, ప్రక్రియను ఈ నెల 10వ తేదీన తమ వెబ్‌సైట్ (http://dietcet.cgg.gov.in)లో అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు.
 
 అభ్యర్థులు 11వ తేదీ నుంచి వెబ్‌సైట్ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవచ్చని పేర్కొన్నారు. డైట్‌సెట్-2013లో అర్హత సాధించిన దాదాపు 2.71 లక్షల మంది అభ్యర్థులు నాలుగు నెలలుగా కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల డీఎడ్ కోర్సులో కౌన్సెలింగ్ ద్వారా 30 వేలకుపైగా సీట్లను భర్తీ చేయనున్నారు. మైనారిటీ కళాశాలల్లో ప్రవేశాలకు ప్రత్యేక షెడ్యూలు జారీ కానుంది.  
 
 ఇదీ షెడ్యూలు...
  నవంబర్ 11 నుంచి 26 వరకూ మొదటి దశ కౌన్సెలింగ్
  11 నుంచి 14 వరకూ వెబ్ ఆప్షన్లు
  19న సీట్ల కేటాయింపు
  23 నుంచి 26 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  27న తరగతులు ప్రారంభం
  డిసెంబర్ 2 నుంచి 19 వరకూ రెండో దశ కౌన్సెలింగ్
  2 నుంచి 4 వరకూ వెబ్ ఆప్షన్లు
  10న సీట్ల కేటాయింపు
  16 నుంచి 19 వరకూ సర్టిఫికెట్ల వెరిఫికేషన్
  27 నుంచి 30 వరకూ చివరి దశ కౌన్సెలింగ్
  27 నుంచి 29 వరకూ వెబ్ ఆప్షన్లు
  30న సీట్ల కేటాయింపు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement