ప్రాణవాయువుకే ప్రాధాన్యం  | Demand for oxygen beds with growing number of corona cases | Sakshi
Sakshi News home page

ప్రాణవాయువుకే ప్రాధాన్యం 

Published Sun, Jun 21 2020 4:08 AM | Last Updated on Sun, Jun 21 2020 4:08 AM

Demand for oxygen beds with growing number of corona cases - Sakshi

సాక్షి, అమరావతి:  కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు తీసుకుంది. ఓవైపు కరోనా పరీక్షల్ని పెంచుతూనే.. మరోవైపు ఆస్పత్రుల్లో వసతుల సామర్థ్యాన్ని మరింతగా పెంచాలని నిర్ణయించింది.  

► రాష్ట్రంలో కరోనా రోగులకు వెంటిలేటర్‌పై ఉంచి వైద్యం అందించాల్సినంత తీవ్రత, అవసరం లేదనే విషయాన్ని నిపుణులు గుర్తించారు.
► ఆక్సిజన్‌ అందే ఏర్పాటు చేసి వైద్యం చేయడం ద్వారా మెరుగైన ఫలితాలను సాధిస్తున్నట్టు స్పష్టం చేస్తున్నారు.
► అందుకే ప్రభుత్వ ఆస్పత్రులతో పాటు ప్రైవేట్‌ ఆస్పత్రుల్లోనూ ఆక్సిజన్‌తో కూడిన పడకలను వేలాదిగా ఏర్పాటు చేస్తున్నారు.
► కోవిడ్‌ కేసుల విషయంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా ఆక్సిజన్‌ నిల్వలను రెట్టింపు చేసే పనిలో నిమగ్నమయ్యారు.
► ప్రభుత్వ, ప్రైవేట్‌ ఆస్పత్రుల్లో కలిపి 21,451 పడకలకు ఆక్సిజన్‌ ఏర్పాటు చేస్తున్నారు.

ఏ సమయంలో అవసరమంటే.. 
► రోగి శరీరంలో ఆక్సిజన్‌ నిల్వలు బాగా తగ్గి.. శ్వాస కూడా తీసుకోలేని సమయంలో వెంటిలేటర్‌ ద్వారా ఆక్సిజన్‌ ఇస్తారు. 
► ఊపిరితిత్తుల పనితీరు ఫర్వాలేదు.. ఆక్సిజన్‌ నిల్వలు మాత్రమే తగ్గాయి అనుకుంటే మాస్క్‌ లేదా నాజిల్‌ పైప్‌లైన్‌ ద్వారా ఆక్సిజన్‌ అందిస్తారు. 
► ఒక పేషెంట్‌కు నిమిషానికి రెండు లేదా మూడు లీటర్ల ఆక్సిజన్‌ అవసరమవుతుంది, 
► ఒక పేషెంట్‌కు రోజుకు ఒక సిలిండర్‌ అవసరమవుతుంది. 60 ఏళ్లు దాటిన వారికి ఇంకా ఎక్కువ అవసరం. 
► ఒక సిలిండర్‌ ఆక్సిజన్‌ ధర ప్రాంతాన్ని బట్టి రూ.200 నుంచి రూ.300 వ్యయమవుతుంది. రాష్ట్రంలో 15 కంపెనీలు ఆక్సిజన్‌ ఉత్పత్తి చేస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement