నల్లగొండ అర్బన్, న్యూస్‌లైన్: ప్రతి ప్రభుత్వ ఉద్యోగికి సర్వీసు రిజిష్టర్(ఎస్‌ఆర్) గుండెకాయలాంటిది. అలాంటి పుస్తకం అనూహ్యంగా పాడైపోతే ఆ ఉద్యోగి పరిస్థితి ప్రశ్నార్థకమే. ఇప్పుడా పరిస్థితి జిల్లా విద్యాశాఖ పరిధిలోని కొందరు ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు. జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో పలువురు అధికారులు, హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సంబంధించిన సర్వీసు పుస్తకాలు కాలిబూడిదయ్యాయి. దీంతో వారిలో అయోమ యం నెలకొంది. సర్వీసుబుక్ లేకపోతే ఏమి చేయాలో తెలియక రిటైర్‌మెంట్ వయస్సుకు దగ్గరలో ఉన్న హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.
సర్వీసు రెగ్యులరైజేషన్, పేఫిక్సేషన్, ఇతర ప్రయోజనాల కోసం కార్యాలయంలో సమర్పిస్తే అగ్నిప్రమాదంలో కాలి పోయాయని, ఇప్పుడు తమ పరిస్థితి ఎలా అని అక్కడున్న అధికారులతో వాకబు చేస్తున్నారు. సర్వీసు రిజిష్టర్లు సమర్పించిన రుజువు/రశీదులను చూపి కొత్తగా సర్వీసు పుస్తకాలు తెరిచేందుకు అనుమతి ఉత్తర్వులు పొందాలని డీఈఓ ప్రకటించినా సమగ్ర వివరాలతో సర్వీసు బుక్కులు మళ్లీ చేతికొచ్చేదాకా ఇబ్బందేనని మదనపడుతున్నారు.
సర్వీస్ బుక్‌లో ఏముంటాయంటే..
ఉద్యోగి నియామకపు తేదీ నుంచి రిటైర్‌మెంట్ తేదీ వరకు అతని ఉద్యోగానికి సంబంధించిన అన్ని వివరాలు, సంఘటనలు సర్వీసు రిజిష్టర్‌లో నమోదు చేస్తారు. ఉద్యోగి విధుల్లో చేరిన వెంటనే ఎస్‌ఆర్ తెరుస్తారు.
ఏమేమి నమోదు చేస్తారంటే..
ఉద్యోగి సర్వీసు పుస్తకంలో పేరు, తండ్రి పేరు, చిరునామా ముందు పేజీలో ఉంటాయి. విద్యార్హతలు, మొదటి నియామకపు ఉత్తర్వులు, తేదీ, జీతం వివరాలు, ఇంక్రిమెంట్లు, పేఫిక్సేషన్లు, ప్రొబేషనరీ, డిక్లరేషన్, పాసైన టెస్ట్‌లు, సర్వీసులోని అంతరాయాలు, సస్పెన్షన్, క్యాజు వల్, సెలవేతర సెలవులు, రికవరీలు, నామినేషన్ వివరాలు నమోదు చేస్తారు. బదిలీలు, రిలీవ్ తేదీలు, కొత్తస్థానంలో చేరిన తేదీలు, సంబంధిత ఉత్తర్వులు ఉంటాయి.
సర్వీస్ వెరిఫికేషన్..
ఉద్యోగి సంవత్సర కాలంలో సంతృప్తికరంగా పనిచేశారని తెలుపుతూ పైఅధికారి సర్వీస్ వెరిఫికేషన్ చేస్తారు. ఉన్నతాధికారితో ప్రవర్తిం చిన తీరుపై రిమార్కులను నమోదు చేస్తారు. రిటైర్మెంట్, పెన్షన్ వివరాలు, సంపాదిత సెల వుల (ఈఎల్‌లు) అకౌంట్లు, మెడికల్ లీవ్‌ల అకౌంట్లు, హాఫ్ పే లీవ్ అకౌంట్ల వివరాలుంటాయి.
ఒరిజినల్ ఎస్‌ఆర్ పోతే..
సహజంగా కొందరు ఉద్యోగులు తమవద్ద డూప్లికేట్ ఎస్‌ఆర్ ఏర్పాటు చేసుకుంటారు. అలా ఏర్పాటు చేసుకునే అవకాశం కూడా ఉంది. వాటిల్లో అన్ని నమోదులపై కార్యాలయ అధిపతితో ధ్రువీకరణ పొందవచ్చు. ఒరిజినల్ ఎస్‌ఆర్ పోయినపుడు ఈ డూప్లికేట్ ఎస్‌ఆర్‌లోని నమోదుల ఆధారంగా తాజా ఎస్‌ఆర్‌ను పొందవచ్చు. ఈ మేరకు 1964 జూన్ 22న జీఏడీ 216 జీఓ జారీ చేసింది. అయితే చాలా మందికి డూప్లికేట్ ఎస్‌ఆర్ నిర్వహణ చేసేంత ఓపిక ఉండదు. ఒరిజినల్‌లో నమోదులు చేయించుకునేందుకు బద్దకిస్తుం టారు. అలాంటి వారి పరిస్థితి ప్రస్తుతం అగమ్యగోచరమే. ఒకవేళ డూప్లికేట్ ఉన్నా మంచి వివరాలు నమోదు చేయించుకునేందుకు ఆసక్తి చూపి శిక్షలు, ఇతర అంతరాయాలను నమోదు చేయించుకుంటారనే నమ్మకం లేదు.
శిక్షల నమోదును తెలియజేస్తారా..?
ఉద్యోగులకు సంబంధించిన డాక్యుమెంట్లను చూపి కొత్త సర్వీసు బుక్‌ను ప్రారంభించుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో పలు సమస్యలు, సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు లేకపోలేదు. తనకు అనుకూలమైన వివరాలను చెప్పవచ్చునేమో కానీ శిక్షలు, సస్పెన్షన్‌లు, ఇతర వివరాలను వెల్లడిం చకపోతే ఎలాగనేది తెలియని పరిస్థితి. సస్పెన్షన్‌కు గురైన వివరాలు, ఇంక్రిమెంట్లు నిలుపుదల చేసిన వివరాలు, ఇతర హెచ్చరికలు, శిక్ష విధించిన వివరాలను ఉద్యోగి గోప్యంగా ఉంచి, సంబంధిత డాక్యుమెంట్లను వెల్లడించకపోతే అవి కొత్తపుస్తకంలో నమోదయ్యే అవకాశం లేకుండా పోతుంది. జిల్లా కార్యాలయంలో ఉంటాయా అంటే ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం పూర్తిగా కాలిపోయింది. కొన్ని కాగి తాలు లభ్యమైనా అవి ఎవరివి, ఎప్పుడు, ఎక్కడ, ఏమిటీ అని విశ్లేషించే పరిస్థితులుంటాయా అన్న అనుమానాలు, సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
ఎస్‌ఆర్ ఎలా?
Published Mon, Dec 2 2013 1:56 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM
Advertisement
Advertisement