సాక్షి, నిజామాబాద్: సదరు అధికారి విధులలో కొనసాగేలా నేడో, రేపో ప్రత్యేక జీఓను జారీ చేసేందుకు రంగం సిద్ధం చేయడం ఆ శాఖ వర్గాలలో చర్చనీయాం శంగా మారింది. ‘అధికార’ నేతల అడుగులకు మడుగులొత్తడం ఆయనకున్న ప్రత్యేక అర్హత అని పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఇదీ సంగతి
జిల్లాలోని పోచారం ప్రాజెక్టు కాలువ మరమ్మతు పను లు మూడేళ్ల క్రితం జరిగాయి. కాలువలకు సిమెంట్‌తో లైనింగ్ పనులు చేపట్టారు. నీటి పారుదలశాఖ అధికారుల అలసత్వం కారణంగా రూ.లక్షలు విలువ చేసే సిమెంట్, కాంక్రీట్ పనులు అస్తవ్యస్తంగా కొనసాగా యి. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున ఫిర్యాదులు రావడం తో ప్రభుత్వం విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగంతో విచారణకు ఆదేశించింది. పూర్తిస్థాయిలో విచారణ చేపట్టిన విజిలెన్స్ విభాగం భారీగా అక్రమాలు జరి గినట్లు తేల్చింది. ఇందులో సదరు అధికారి అలసత్వం ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు ప్రభుత్వానికి, నీటి పారుదల శాఖకు నివేదిక కూడా పంపారు.
ఈ నివేదిక ఆధారంగా సదరు అధికారి పదోన్నతి కూడా నిలిచిపోయింది. ఇదిలా ఉండగా భారీ నీటిపారుదల శాఖలో రాష్ట్రవ్యాప్తంగా ఈ నెలాఖరుతో సుమారు 20 మందికి పైగా అధికారులు పదవీ విరమణ చేస్తున్నా రు. వీరందరిని పక్కన బెట్టి విజిలెన్స్ విచారణ ఎదుర్కొని, పదోన్నతి నిలిచిపోయిన ఈ ఒక్క అధికారి పదవీకాలాన్ని మాత్రమే పొడిగించాలని నీటి పారుద ల శాఖ ఇంజనీర్ ఇన్ ఛీప్ (ఈఎన్‌సీ) కార్యాలయం లో కొందరు పావులు కదుపుతున్నారని సమాచారం. ఇది ఆ శాఖ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా పదవీ విరమణ చేస్తున్న అధికారి పదవీకాలాన్ని పొడగించాలన్నా, జిల్లా ఉన్నతాధికారుల నుంచి ప్రతిపాదనలు వెళ్లాలి. నిబంధనల ప్రకారం ఆశాఖ (ఎస్‌ఈ ప్రతిపాదించాలి. ఇవేవీ లేకుండానే ఈఎన్‌సీ కార్యాలయంలో చక్రం తిప్పుతున్నారని తెలుస్తోంది.
అక్రమాలను సక్రమం చేసుకునేందుకేనా?
జిల్లాలో నీటి పారుదలశాఖ పనులలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎలాంటి అనుమతులు లేకుండానే, మంజూరు కాకుం డానే రూ. కోట్లలో విలువ చేసే పనులు జరుగుతున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి అక్రమాల ను సక్రమం చేసుకునేందుకు, ఈ పనులకు బిల్లుల చెల్లింపులు చేసుకునేందుకు ప్రత్యేకంగా ఈ అధికారి సేవలను మరో ఏడాది పొడగించుకునేలా పావులు కదుపుతున్నారని తెలుస్తోంది. ఈయన స్థానంలో ఇత ర అధికారులు వస్తే అనుకున్నది అనుకున్నట్లు జరిగే అవకాశం లేకపోవడంతో ఈయన సేవలనే కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కొసమెరుపు ఏంటంటే మరో రెండు వారాలలో పదవీ విరమణ చేయనున్న ఈ అధికారికి సంబంధించి విజిలెన్స్ విచారణ ఎత్తివేయడంతో పాటు, పదోన్నతి కూడా కల్పించేందుకు రంగం సిద్ధమవుతున్నట్లు ఆ శాఖ వర్గాలలో ప్రచారం జరుగుతోంది.
మేం ప్రతిపాదనలు పంపలేదు
పదవీ విరమణ చేస్తున్న అధికారుల సేవల కొనసాగింపునకు సంబంధించి జిల్లా నుంచి ఎలాంటి ప్రతిపాదనలు పంపలేదు. జిల్లాలో అలాంటి అవసరం ఉన్నట్లు మేం భావించడం లేదు. పదవీ కాలం పొడగించాలంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి.
-షాబ్‌జాన్, ఎస్‌ఈ
‘అలసత్వాని’కి అందలం!
Published Fri, Jan 17 2014 5:39 AM | Last Updated on Wed, Sep 5 2018 1:38 PM
Advertisement