బీజేపీ పాలనలోనే అభివృద్ధి సాధ్యం | developing in bjp governament | Sakshi

బీజేపీ పాలనలోనే అభివృద్ధి సాధ్యం

Published Wed, Jul 27 2016 1:06 AM | Last Updated on Mon, Sep 4 2017 6:24 AM

developing in bjp governament

అల్లూరు : బీజేపీ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. అల్లూరులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం 42 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, కావలి నియోజక ఇన్‌చార్జ్‌ సి.వి.సి.సత్యం, మండల అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, నాయకులు మురళీకృష్ణ, బాబు, నవీన్, మల్లి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement