sureshreddy
-
రైతుల ఆందోళనలు పట్టని టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: వ్యాపారులతో కుమ్మక్కయిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు మద్దతు ధర దక్కకుండా అన్యాయం చేస్తూనే, కాంగ్రెస్‌పై నెపం మోపేందుకు యత్నిస్తున్నాయని అసెంబ్లీ మాజీ స్పీకర్ కె.ఆర్.సురేశ్‌రెడ్డి ఆరోపించారు. గిట్టుబాటు ధర కోసం రైతులు ఇబ్బంది పడుతూ రాష్ట్రంలో రోడ్లెక్కుతున్నా, ఎర్రజొన్న, పసుపు రైతులు 15 రోజులుగా ధర్నాలు చేస్తున్నా టీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. బుధవారం గాంధీభవన్‌లో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్, మరో నేత రాజారాంయాదవ్తో కలసి విలేకరులతో మాట్లాడారు. రైతుల మద్దతు ధర కోసం రూ.2 వేల కోట్లు బడ్జెట్లో పెడతామని ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చిన టీఆర్ఎస్ ఒక్క రూపాయి కూడా ఇంతవరకు పెట్టలేదని విమర్శించారు. రైతుల కోసం కాంగ్రెస్ పార్టీ ఎంతో చేసిందని చెప్పారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జీవో 153 ద్వారా రూ.30 కోట్లు విడుదల చేశామని, రూ.11 కోట్లను ట్రేడర్స్ యాక్ట్ కింద ఇచ్చామని, రైతులపై కాంగ్రెస్ ప్రేమకు ఇది నిదర్శనమని పేర్కొన్నారు. రైతుల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో చెప్పాలని ఆయన సవాల్ చేశారు. కల్తీ విత్తనాల వెనుక ఎమ్మెల్సీ హస్తం కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నకిలీ విత్తనాలు రాజ్యమేలుతున్నాయని, దీని వెనుక అధికార టీఆర్ఎస్కు చెందిన ఓ ఎమ్మెల్సీ హస్తం ఉందని కేంద్ర మాజీ మంత్రి బలరాం నాయక్ బుధవారం ఆరోపించారు. నకిలీ విత్తనాల గుట్టు తేల్చి అసలు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. గిరిజనులకు పంపిణీ చేసిన పోడు భూములను అటవీ అధికారులు బలవంతంగా లాక్కుంటున్నా సీఎం కేసీఆర్ అధికారులనే వెనకేసుకురావటం బాధాకరమన్నారు. నకిలీ విత్తనాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదని మండిపడ్డారు. పోడు భూములు లాక్కోవడంతో చనిపోయిన రైతు కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని కోరారు. -
బీజేపీ పాలనలోనే అభివృద్ధి సాధ్యం
అల్లూరు : బీజేపీ పాలనలోనే అభివృద్ధి సాధ్యమని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. అల్లూరులోని ఆర్యవైశ్య కల్యాణ మండపంలో మంగళవారం మండల స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల అభ్యున్నతి కోసం 42 సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని, ప్రజలు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కర్నాటి ఆంజనేయరెడ్డి, జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, కావలి నియోజక ఇన్చార్జ్ సి.వి.సి.సత్యం, మండల అధ్యక్షుడు హరిప్రసాద్‌రెడ్డి, నాయకులు మురళీకృష్ణ, బాబు, నవీన్, మల్లి తదితరులు పాల్గొన్నారు. -

'ప్రభుత్వ ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం'
హైదరాబాద్ : సాగునీటి ప్రాజెక్టులపై టీఆర్ఎస్ సర్కార్, ప్రభుత్వ పెద్దలు చేస్తున్న ప్రకటనలపై ప్రజల్లో గందరగోళం నెలకొందని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్, కాంగ్రెస్ సీనియర్ నేత సురేష్ రెడ్డి వ్యాఖ్యానించారు. గాంధీభవన్‌లో సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ పనితీరుపై టీపీసీసీ కమిటీ శనివారం భేటీ అయింది. రాష్ట్ర ప్రభుత్వ పనితీరుతో ప్రాజెక్టులు పూర్తవుతాయో లేదోననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఆరోపించారు. ఇకపై ప్రతినెల అంశాల వారీగా ప్రభుత్వ పనితీరును ప్రజల్లో ఎండగడతామని సురేష్ రెడ్డి పేర్కొన్నారు. -
బాబును అరెస్ట్ చేయాలంటూ అర్ధనగ్న ప్రదర్శన
జీడిమెట్ల (హైదరాబాద్) : ఓటుకు నోటు వ్యవహారంలో కీలక సూత్రదారి అయిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడును వెంటనే అరెస్టు చేయాలిని వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ధర్నా చేశారు. జీడీమెట్లలోని ఏపీఐఐసీ కాలనీలో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఎదుట కుత్బుల్లాపూర్ నియోజకవర్గ వైఎస్సార్ సీపీ నేత సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. రేవంత్ కేసులో బలమైన సాక్ష్యాదారాలున్నందున బాబును అరెస్టు చేయాలంటూ ఆయన డిమాండ్ చేశారు.