సాక్షి, దేవీపట్నం: గోదావరిలో ప్రమాదానికి గురైన రాయల్ వశిష్ట బోటు ప్రమాదం నుంచి పలువురు పర్యాటకులు ప్రాణాలతో బయటపడ్డారు. కాగా తిరుపతికి చెందిన మధులత తన భర్తతో కలిసి పాపికొండల విహారానికి వచ్చారు. బోటు ప్రమాదంలో ఆమె సురక్షితంగా బయటపడగా, ఆమె భర్త గల్లంతు అయ్యాడు. దీంతో భర్త ఆచూకీ కోసం మధులత కన్నీరుమున్నీరుగా విలపించింది. మరోవైపు విహార యాత్రకు వెళ్లిన వారి కుటుంబసభ్యులు తమ వారి ఆచూకీ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రమాద వార్త తెలియడంతో ఫోన్ చేసినా అవి పని చేయడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ కుటుంబ సభ్యుల వివరాలు తెలపాలంటూ అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా ఈ విహార యాత్రకు వెళ్లినవారిలో వరంగల్ అర్బన్ జిల్లా కాజిపేట మండలం, కడిపికొండ గ్రామస్తులు 14 మంది ఉన్నారు. ఇందులో అయిదుగురి ఆచూకీ తెలియగా, మిగతా 9మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
ప్రమాదం నుంచి బయటపడినవారు
బసికె. వెంకటస్వామి (వరంగల్)
ఆరేపల్లి. యాదగిరి (వరంగల్)
గొర్రె. ప్రభాకర్ (వరంగల్)
దర్శనాల సురేష్ (వరంగల్)
బసికె దశరథం (వరంగల్)
ఎండీ మజ్హార్ (హైదరాబాద్)
సీహెచ్. రామారావు (హైదరాబాద్)
కె.అర్జున్ (హైదరాబాద్)
జానకి రామారావు (హైదరాబాద్)
సురేష్ (హైదరాబాద్)
కిరణ్ కుమార్ (హైదరాబాద్)
శివశంకర్ (హైదరాబాద్)
రాజేష్ (హైదరాబాద్)
గాంధీ (విజయనగరం)
మధులత (తిరుపతి)
బుసల లక్ష్మి (విశాఖ గోపాలపురం)
వరంగల్ నుంచి వెళ్లినవారిలో ఆచూకీ తెలియని వారి వివరాలు
సివి. వెంకటస్వామి
బసికె. రాజేంద్రప్రసాద్
కొండూరు. రాజకుమార్
బసికె. ధర్మరాజు
గడ్డమీది. సునీల్
కొమ్ముల. రవి
బసికె. రాజేందర్
బసికె. అవినాష్
గొర్రె. రాజేంద్రప్రసాద్
చదవండి:
మా కళ్ల ముందే మునిగిపోయారు: ప్రత్యక్ష సాక్షి
బోటులో ఎక్కువమంది తెలంగాణవారే!
పాపికొండలు విహార యాత్రలో విషాదం!
రాయల్ వశిష్టకు అనుమతి లేదు...
బోటు ప్రమాద ఘటనపై సీఎం జగన్ సీరియస్
Comments
Please login to add a commentAdd a comment