ధన గణపతి | Dhana Gajapathi at Mangalagiri Flower Market Center | Sakshi
Sakshi News home page

ధన గణపతి

Published Wed, Sep 19 2018 1:53 AM | Last Updated on Sat, Sep 22 2018 7:51 PM

Dhana Gajapathi at Mangalagiri Flower Market Center - Sakshi

మంగళగిరి టౌన్‌/మైలవరం: వినాయక నవరాత్రులను పురస్కరించుకొని గుంటూరు జిల్లా మంగళగిరి పూల మార్కెట్‌ సెంటర్‌లో సంకా బాలాజీగుప్తా బ్రదర్స్, వర్తక వ్యాపారుల ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గణనాథుడికి మంగళవారం సాయంత్రం రూ.కోటిన్నర కరెన్సీ నోట్లతో ధనగణపతిగా అలంకరించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ 13 ఏళ్లుగా గణనాథుడిని ధనగణపతిగా అలంకరిస్తున్నామని, గతేడాది రూ.1.25 కోట్ల కరెన్సీనోట్లతో అలంకరించామని చెప్పారు. రూపాయి నోటు నుంచి రూ.2 వేల నోట్లతో ఈ అలంకారం చేసిన ట్టు తెలిపారు. ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన ధనగణపతిని వీక్షించడానికి భక్తులు అధికసంఖ్యలో తరలివచ్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement