జమ్మలమడుగు: ఎస్సీ వర్గీకరణ కోరుతూ అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించి, పార్లమెంట్‌కు పంపాలని డిమాండ్ చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు గాంధీ సర్కిల్‌లో మంగళవారం ఉదయం ఎమ్మార్పీఎస్ నాయకులు రాస్తారోకో చేపట్టారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు జంగాల మునుస్వామి, చిన్నయ్యతోపాటు వందమంది కార్యకర్తలు పాల్గొన్నారు.