ఒంగోలు టౌన్ : అసంఘటిత రంగం నుంచి అంతరిక్షం వరకు అన్ని రంగాల్లో మహిళలు ముందుంటున్నప్పటికీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచే వారిపై వివక్షత మొదలవుతోందని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వై.వెంకటేశ్వర్లు ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలపై జరుగుతున్న వివక్షతను ధైర్యంగా, నిర్భయంగా ఎదిరించాలని పిలుపునిచ్చారు.
స్థానిక రైజ్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన విద్యార్థినుల రాష్ట్రస్థాయి విద్యా వైజ్ఞానిక తరగతుల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఇంట్లోపని పూర్తిగా అమ్మాయిలే చేయాలని, అబ్బాయిలు చేయడం తప్పు అంటూ కుటుంబం నుంచే మహిళలను చిన్నచూపు చూస్తున్నారని ఆందోళన చెందారు. మార్కెట్‌లో ఏ వస్తువు అమ్ముడుపోవాలన్నా పెట్టుబడిదారులకు తెలిసిన సూత్రం అమ్మాయిలను అశ్లీలంగా చూపించడమేనని మండిపడ్డారు.
దీంతో అశ్లీలత పెరిగిపోయి అభ్యుదయ భావాలు తగ్గిపోతున్నాయని వైవీ పేర్కొన్నారు. తొలుత స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యం, సోషలిజం ఆశయాలతో కూడిన ఎస్‌ఎఫ్‌ఐ పతాకాన్ని రాష్ట్ర సహాయ కార్యదర్శి రాణి ఆవిష్కరించారు. ఇటీవల మృతిచెందిన అమరవీరులకు సంతాప తీర్మానాన్ని విశాఖ జిల్లా ఎస్‌ఎఫ్‌ఐ కన్వీనర్ చిన్నారి ప్రవేశపెట్టారు. శిక్షణ తరగతుల్లో డాక్టర్ ఉదయని, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి నూర్ అహమ్మద్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు కిరణ్, రఘురామ్, రాష్ట్ర నాయకులు సోఫియా, తులసి పాల్గొన్నారు.
తల్లి గర్భంలో నుంచే వివక్షత
Published Sun, Nov 9 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 4:06 PM
Advertisement
Advertisement