మండల పరిషత్‌ల్లో మహిళలకు 19 స్థానాలు
Published Sun, Mar 9 2014 2:59 AM | Last Updated on Sat, Sep 2 2017 4:29 AM
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లలో మహిళలకు పెద్ద పీటవేశారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ఎన్.మోహన్‌రావు శనివారం రిజర్వేషన్ల వివరాలు వెల్లడించారు. జిల్లాలో 34 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఉన్నాయి. వీటిలో మహిళలకు 19 స్థానాలు, 15 స్థానాలకు జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు చెరో నాలుగు స్థానాలు కేటాయించగా, బీసీలకు 17స్థానాలు, ఓసీలకు తొమ్మిది స్థానాలు కేటాయించారు. నాలుగు ఎస్టీ స్థానాల్లో మూడింటిని మహిళలకు కేటాయించగా, ఒక స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. అదేవిధంగా నాలుగు ఎస్సీ స్థానాల్లో రెండు మహిళలకు, రెండు జనరల్‌కు కేటాయించారు. 17 బీసీ స్థానాల్లో మహిళలకు తొమ్మిది, జనరల్‌కు ఎనిమిది స్థానాలు కేటాయించారు. తొమ్మిది ఓసీ స్థానాల్లో మహిళలకు ఐదు, జనరల్‌కు నాలుగు స్థానాలు కేటాయించారు
మహిళలకే అధిక స్థానాలు:
మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో ఈసారి మహిళలకే పెద్దపీట వేశారు. అన్ని కేటగిరీల నుంచి మొత్తం 19 మహిళలకు కేటాయించారు. గత ఎన్నికల్లో మహిళలకు 14 స్థానాలు కేటాయించగా ఈ సారి ఐదు స్థానాలు పెరిగాయి
మండల్ పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ వివరాలు
మండలం ఎంపీపీ స్థానం
గుమ్మలక్ష్మీపురం ఎస్టీ మహిళ
పార్వతీపురం ఎస్టీ మహిళ
వేపాడ ఎస్టీ మహిళ
మెంటాడ ఎస్టీ జనరల్
బొండపల్లి ఎస్సీ మహిళ
గరుగుబిల్లి ఎస్సీ మహిళ
గంట్యాడ ఎస్సీ జనరల్
జామి ఎస్సీ జనరల్
బొబ్బిలి బీసీ మహిళ
చీపురుపల్లి బీసీ మహిళ
కొమరాడ బీసీ మహిళ
కొత్తవలస బీసీ మహిళ
కురుపాం బీసీ మహిళ
మక్కువ బీసీ మహిళ
పాచిపెంట బీసీ మహిళ
సీతానగరం బీసీ మహిళ
గుర్ల బీసీ మహిళ
బాడంగి బీసీ జనరల్
బలిజిపేట బీసీ జనరల్
దత్తిరాజేరు బీసీ జనరల్
డెంకాడ బీసీ జనరల్
గరివిడి బీసీ జనరల్
మెరకముడిదాం బీసీ జనరల్
రామభద్రపురం బీసీ జనరల్
ఎస్.కోట బీసీ జనరల్
గజపతినగరం ఓసీ మహిళ
జియ్యమ్మవలస ఓసీ మహిళ
నెల్లిమర్ల ఓసీ మహిళ
సాలూరు ఓసీ మహిళ
తెర్లాం ఓసీ మహిళ
భోగాపురం ఓసీ జనరల్
ఎల్.కోట ఓసీ జనరల్
పూసపాటిరేగ ఓసీ జనరల్
విజయనగరం ఓసీ జనరల్
Advertisement