District Parishad
-
బీసీ కోటా 24 శాతం లోపే!
సాక్షి. హైదరాబాద్: త్వరలో జరగనున్న పంచాయతీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లు 23–24 శాతానికి మధ్య పరిమితం కానున్నా యి. ఎట్టి పరిస్థితిలో రిజర్వేషన్లు 50 శాతానికి మించరాదని గతంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును ఈ ఎన్నికల్లో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. సుప్రీం కోర్టు తీర్పు మేరకు 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు అమలు చేసేందుకు రాష్ట్ర న్యాయ శాఖ శనివారం రాత్రి అత్యవసర ఉత్తర్వులు (ఆర్డినెన్స్) జారీ చేసిం ది. కొత్తగా అమల్లోకి వచ్చిన తెలంగాణ పంచాయతీరాజ్ చట్టంలో ఎస్సీ, ఎస్టీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు కేటాయించాలని, బీసీలకు 34 శాతానికి తగ్గకుండా రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం పొందుపరిచింది. ఎన్నికల్లో 2011 జనా భా లెక్కల ఆధారంగా పంచాయతీ రిజర్వేషన్లను ఖరారు చేయాల్సి ఉండగా, ఎస్సీలకు 20.46 శాతం, ఎస్టీలకు 5.73 శాతం రిజర్వేషన్లను కేటాయించాల్సి ఉంది. దీనికి తోడు పంచాయతీరాజ్ చట్టం ప్రకారం బీసీలకు 34 శాతం కోటా అమలు చేస్తే మొత్తం రిజర్వేషన్లు 60.19 శాతానికి పెరిగిపోనున్నాయి. పంచాయతీరాజ్ చట్టంలోని నిబంధనల ప్రకారం.. ఎన్నికల్లో బీసీలకు 34 శాతం కోటా అమలు చేసేందుకు సుప్రీం కోర్టు తీర్పు అడ్డంకిగా మారింది. జనవరి 10లోగా పంచాయతీ ఎన్నికలను నిర్వహిం చాలని హైకోర్టు విధించిన గడువు ముంచుకొస్తోంది. దీంతో ప్రభుత్వం ఈ ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రత్యేక ఆర్డినెన్స్ జారీ చేయడం ద్వారా రాష్ట్ర పంచాయతీరాజ్ చట్టానికి సవరణలు జరిపింది. సర్పంచ్ పదవుల కోసం జనాభా దామాషా ప్రకారం ప్రాధాన్యత క్రమంలో ఎస్టీ, ఎస్సీలకు వరుసగా 5.73 శాతం, 20.46 శాతం రిజర్వేషన్లను కేటాయించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో బీసీలకు 23.81 శాతం కోటా మాత్రమే లభించే అవకాశముంది. గత జూన్ 12న పంచాయతీరాజ్ శాఖ జారీ చేసిన సర్క్యులర్ ప్రకారం.. రాష్ట్రంలో మొత్తం 12,751 సర్పంచ్ స్థానాలుం డగా, షెడ్యూల్ ప్రాంతంలోని 1,308 పంచాయతీల తో పాటు 100 శాతం ఎస్టీల జనాభా కలిగిన 1,326 పంచాయతీలు ఎస్టీలకు రిజర్వు అవనున్నాయి. దీనికి తోడు 5.73 శాతం ఎస్టీ కోటా కింద రానున్న 580 స్థానాలకు కలిపి ఎస్టీలకు మొత్తం 3,214 సర్పంచ్ పదవులు రిజర్వు అవుతాయి. ఎస్సీలకు 20.46 శాతం కోటా కింద 2,070 స్థానాలు రిజర్వు కానున్నాయి. 34 శాతం కోటా కింద అప్పట్లో బీసీలకు 3,440 స్థానాలకు కేటాయించారు. తాజాగా ఆర్డినెన్స్ మేరకు బీసీ కోటాను 24 శాతానికి లోపు తగ్గించనుండటంతో ప్రాథమిక అంచనాల ప్రకారం బీసీలకు కేటాయించే సర్పంచ్ స్థానాల సంఖ్య 2,784 కు తగ్గే అవకాశముంది. రిజర్వేషన్ల కేటాయింపుపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తే ఈ అంశంపై స్పష్టత రానుంది. చివరిసారిగా 2013–14లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమ లు చేయగా, ఒక్కసారి 10 శాతానికి పైగా రిజర్వేషన్లు తగ్గిపోనుండటంతో బీసీ వర్గాల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసినట్లు శనివారం వార్తలు వచ్చాయి. అయితే సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ఈ కోటా 24 శాతం లోపే పరిమితం కానుంది. -
చర్చనీయాంశంగా.. జెడ్పీ!
సాక్షిప్రతినిధి, నల్గొండ : నల్గొండ జిల్లా పరిషత్ రాజకీయం రసకందాయంలో పడింది. జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్ తిరిగి సొంతగూటికి చేరడంతో జిల్లా పరిషత్ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోనున్నాయి. కాంగ్రెస్‌నుంచి జెడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందిన బాలు.. చైర్మన్‌గా ఎన్నికై ఆరు నెలలకే టీఆర్ఎస్లో చేరారు. తదనంతర పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్‌కు చెందిన మరో 19 మంది జెడ్పీటీసీ సభ్యులు కూడా టీఆర్ఎస్లోకి వలసెళ్లారు. జెడ్పీ పాలక వర్గంలో 59 మంది సభ్యులకుగాను స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ 43 వంది, టీఆర్ఎస్ నుంచి 13 మంది, టీడీపీ ఇద్దరు, సీపీఐ నుంచి ఒకరు జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. దీంతో ఎస్టీలకు రిజర్వుడు అయిన నల్లగొండ జెడ్పీ చైర్మన్ పీఠాన్ని ఎక్కే అ దృష్టం చందంపేట జెడ్పీటీసీ సభ్యుడిగా గెలిచిన బాలునాయక్‌ను వరించింది. అప్పటికీ ఆయన దేవరకొండ ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు. వివిధ కారణాలతో ఆయన టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, ఆ తరువాత 19 మంది కాంగ్రెస్ సభ్యులు కూడా టీఆర్ఎస్లోకి చేరడంతో జెడ్పీలో వారి బలం 32కు పెరిగింది. కాంగ్రెస్ సంఖ్యా బలం తగ్గి, టీఆర్ఎస్ బలం పెరగడంతో జెడ్పీలో నా లుగేళ్లపాటు వారి ఆధిపత్యమే కొనసాగింది. జిల్లా పరిషత్‌కు కేటాయించే సాధారణ నిధులు, ఆర్థిక సంఘం నిధుల పంపకాల్లో అధికార పార్టీ సభ్యులదే పైచేయిగా ఉండేది. పనుల పంపకాల్లో సభ్యులు అందరికీ కలిపి ఒక వాటా ఇస్తే.. చైర్మన్‌కు ప్రత్యేకమైన వాటా తీసుకునేవారు. ఈ పంపకాల విషయంలో అధికార, ప్రతిపక్ష సభ్యులకు మధ్య ఎప్పుడూ వాగ్వాదం జరిగేది. నిధుల పంపకాల్లో మంత్రి, ఎమ్మెల్యేల సహకారం కూడా చైర్మన్‌కు ఉండడంతో ప్రతిపక్ష సభ్యులకు నోరుమెదిపే అవకాశం లేకుండా పోయింది. చివరకు జెడ్పీ వైస్ చైర్మ¯Œన్ కర్నాటి లింగారెడ్డి సైతం మౌనంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. జానారెడ్డికి అత్యంత సన్నిహితుడైన లింగారెడ్డి కాంగ్రెస్‌నుంచి టీఆర్ఎస్లోకి వెళ్లాల్సిన పరిణామాలు ఏర్పడ్డాయి. కొంతకాలానికి లింగారెడ్డి మళ్లీ కాంగ్రెస్‌లోకి తిరిగొచ్చారు. అధికార సభ్యుల బలంతో నాలుగేళ్ల పాటు రాజ్యమేలిన జెడ్పీ పాలక వర్గం ఇప్పుడు చైర్మన్ తిరిగి సొంత గూటికి చేరడంతో జెడ్పీ రాజకీయాల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పాలకవర్గానికి పది నెలల గడువు జెడ్పీ పాలకవర్గం 2014 జులై 5న కొలువుదీరింది. ఈ ఏడాది జూలై నాటికి నాలుగేళ్లు పూర్తయింది. వచ్చే ఏడాది జులై 4వ తేదీ నాటికి సభ్యుల పదవీకాలం ముగుస్తుంది. అంటే ఇంకా పది నెలల గడువు మిగిలి ఉంది. దేవరకొండ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన బాలునాయక్ తిరిగి మరోసారి ఎమ్మెల్యే కావాలనే, తనకు అవకాశం ఇవ్వాలని కాంగ్రెస్‌లో చేరారు. కాంగ్రెస్ రాష్ట్ర పార్టీ ఒకవేళ ఆయనకు టికెట్ కేటాయిస్తే, ఆ ఎన్నికల్లో ఆయన గెలిస్తే.. చైర్మన్ పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. అదే, ఒకవేళ ఓడిపోతే మాత్రం తిరిగి ఆయన చైర్మన్‌గా కొనసాగే అవకాశం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. కానీ, టీఆర్ఎస్ మెజార్టీ సభ్యులు ఉన్న జెడ్పీలో బాలునాయక్‌ను చైర్మన్‌గా కొనసాగనిస్తారా? లేదంటే అవిశ్వాస తీర్మానానికి సభ్యులు సిద్ధపడతారా..? అన్న విషయం ప్రస్తుతం చర్చనీ యాంశంగా మారింది. ఈ వివాదం ఇప్పట్లో తేలేలా లేకున్నా కాంగ్రెస్ సభ్యులు మాత్రం సంతోషంగా ఉన్నారని అంటున్నారు. ఈ పదినెలల కా లంలో జెడ్పీకి వచ్చే నిధుల్లో కాంగ్రెస్ సభ్యులకు మెజార్టీ వాటా దక్కుతుందని ఆశపెట్టుకున్నారు. అవిశ్వాసం అనివార్యమైతే..! ఒకవేళ చైర్మన్‌పైన అవిశ్వాస తీర్మానం పెట్టాల్సి వస్తే మొత్తం సభ్యుల్లో నాలుగో వంతు మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడున్న సంఖ్యా బలాన్ని బట్టి చూస్తే టీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య సభ్యుల సంఖ్యలో స్వల్ప తేడా మాత్రమే ఉంది. జెడ్పీ రాజకీయ ఎలా ఉండబోతుందో ప్రత్యక్షంగా చూడాలంటే మాత్రం అక్టోబర్ 11వ తేదీ వరకు వేచి చూడాల్సి ఉంటుందంటున్నారు. ఆ రోజున జరగనున్న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో ఇరు పార్టీల సభ్యులు ఎలా వ్యవహరించబోతున్నారు? చైర్మ¯Œన్ విషయంలో వారి వైఖరి ఎలా ఉండబోతోందోనన్న అంశాలు ఆసక్తి రేపుతున్నాయి. -
అధికారులే టార్గెట్ ..!
విజయనగరం ఫోర్ట్: ప్రభుత్వ పాలనా లోపాలను పక్కన పెట్టి అధికారులే టార్గెట్‌గా శనివారం నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం సాగింది. అధికారులు సక్రమంగా పనిచేయడం లేదంటూ అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు మండి పడ్డారు. ఆర్డబ్ల్యూఎస్, డ్వామా, డీపీఓ, వైద్య ఆరోగ్యశాఖ, విద్యశాఖలకు సంబం ధించిన అంశాలపై చర్చ సాగింది. జామిమండల కేంద్రం లో సొంత నిధులతో బోర్లు వేయించానని, బిల్లులు చెల్లిం చాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని జామి జెడ్పీటీసీ సభ్యుడు పెదబాబు ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈపై మండిపడ్డారు. గుర్ల జెడ్పీటీసీ మాట్లాడుతూ గుర్ల మండలం గరికి వలస ఎస్సీ కాలనీలో తాగునీటి పథకాన్ని ప్రారంభించిన రెండు రోజుల తర్వాత నీటిసరఫరా నిలిచిపోయిందని సభ దృష్టికి తెచ్చారు. దీనిపై మంత్రి సుజయ్ స్పందిస్తూ పథక నిర్మాణం పూర్తయ్యాకే తాగునీరు సరఫరా చేయాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. కురుపాంలో తాగునీటి పథకం పాడవ్వడంతో 10 రోజులుగా అక్కడ ప్రజలు నీటి కోసం ఇబ్బంది పడుతున్నారని కురుపాం జెడ్పీటీసీ శెట్టి పద్మావతి తెలిపారు. సెప్టిక్‌ట్యాంక్ క్లీన్ చేయడానికి రూ.30 వేలు వసూలు చేస్తున్నారని, దీనివల్ల మరుగుదొడ్డి నిర్మించడానికి ప్రజలు పెద్దగా ఆసక్తి చూపడం లేదని ఎల్.కోట జెడ్పీటీసీ కరెడ్డ ఈశ్వరావు సభలో ప్రస్తావించారు. దీనిపై మంత్రి కలుగుజేసుకుని ఆర్డబ్ల్యూఎస్, రవాణశాఖ, సెప్టిక్ ట్యాంక్ క్లీనర్స్ తో సమావేశం నిర్వహించి సహజ ధర నిర్ణయిం చాలని జెసీ–2 నాగేశ్వరావుకు ఆదేశించారు. కొమరాడ జెడ్పీటీసీ పావని మాట్లాడుతూ ఉరిటి గ్రామానికి 293 మరుగుదొడ్లు మంజూరయ్యాయని, ఇందులో 150 వరకు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. వైడీఓ నెట్వర్స్ సంస్థ నిర్మాణాల పూర్తికి చొరవచూపడం లేదని తెలిపారు. డ్వామా పీడీపై మండిపడిన ఎమ్మెల్యే చిరంజీవులు.. ఉపాధి హామీ పథకంలో పనిచేసిన కూలీలకు సకాలంలో డబ్బులు రావడం లేదని, దీనివల్ల వేతనదారులు ఇబ్బందిపడుతున్నారని డ్వామా పీడీ రాజ్‌గోపాల్‌ను ప్రశ్నించారు. దీనిపై మంత్రి రంగారావు కలుగుజేసుకుని ఎప్పటి నుంచి ఉపాధిహామీ వేతనదారులకు డబ్బులు ఆగిపోయాయో చెప్పాలని అడిగారు. పిభ్రవరి 19 నుంచి బిల్లులు చెల్లించాల్సి ఉందని, రూ.66 కోట్లు నిధులు పెండింలో ఉన్నాయని, త్వరలోనే «థర్డ్‌పార్టీ ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాకే నగదు జమ చేస్తామని రాజ్‌గోపాల్ బదులిచ్చారు. గుమ్మలక్ష్మీపురం జెడ్పీటీసీ అలజంగి భాస్కరరావు మాట్లాడుతూ ఉపాధిహామీ పథకం కంప్యూటర్ ఆపరేటర్ పోస్టులు, షిప్ట్ ఆపరేటర్ పోస్టులు అమ్మేస్తుండడం వల్ల అర్హులకు అన్యాయం జరుగుతుందని, ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు. దీనిపై డ్వామా పీడీ కలుగుజేసుకుని నియామకాలు రాష్ట్ర స్థాయిలో జరిగాయని చెప్పారు. రాష్ట్ర స్థాయిలో జరిగితే జిల్లాలో ఉన్న అభ్యర్థులకు అన్యాయం జరగదా అని ప్రశ్నించారు. డెంకాడ జెడ్పీటీసీ అప్పలనారాయణ మాట్లాడుతూ మోపాడ పీహెచ్సీలో స్టాఫ్ నర్సు పోస్టులు –3, ఒక ల్యాబ్ టెక్సీషియన్ పోస్టును భర్తీ చేయాలని కోరారు. రెండేళ్లుగా పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా అందుతాయని ప్రశ్నించారు. కురుపాం ఆస్పత్రికి మృతదేహాలను తరలించేందుకు అంబులెన్సు లేకపోవడం వల్ల రెండు, మూడు రోజులు మృత దేహాలను ఆస్పత్రుల్లో ఉంచేస్తున్నారని, చందాలు వేసుకుని మృతదేహాన్ని తరలించాల్సి వస్తోందని కురుపాం జెడ్పీటీసీ పద్మావతి అన్నారు. అలమండ ఎంపీటీసీకి నిబంధనలకు విరుద్ధంగా హెచ్‌డీఎస్ చైర్మన్ పదవి ఇచ్చారని, ఆస్పత్రి మధ్యలో కళ్యాణ మండపానికి అతను రోడ్డు వేసేసాడని, హెచ్బిఎస్ చైర్మన్ నుంచి అతన్ని తొలిగిస్తారా లేదా ఆస్పత్రిని కూడ అతనికే ఇచేస్తారా అని జామి జెడ్పీటీసీ పెదబాబు డిఎంహెచ్వోపై మండి పడ్డారు. రుణాలు మంజూరు చేయడంలేదు.. టీడీపీ కార్యకర్తలకు పీఏసీఎస్‌లలో రుణాలు మంజూరు చేయడం లేదని గజపతినగరం ఎమ్మెల్యే కె.ఏ.నాయుడు, పూసపాటిరేగ జెడ్పీటీసీ ప్రసాదరావు, జెడ్పీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తినాయుడులు ఆరోపించారు. దీనిపై పోరాటం చేస్తామన్నారు. సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్ శోభస్వాతిరాణి, ఎమ్మెల్సీ గాదె శ్రీనివాసులనాయుడు, ఎమ్మెల్యేలు మీసాలగీత, కోళ్ల లలితకుమారి, నారాయణస్వామినాయుడు, జెడ్పీ సీఈఓ వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పథంలో జెడ్పీని నడిపిస్తున్నాం
నెల్లూరు(అర్బన్): అభివృద్ధి పనులకు నిధులు చాలకున్నా.. ప్రభుత్వం గ్రాంట్లు నిలిపివేసినా.. ఉన్న కొద్ది పాటి నిధులతోనే జిల్లా పరిషత్‌ను అభివృద్ధి పథంలో నడిపిస్తున్నానని జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి అన్నారు. ఆయన చైర్మన్ అయి మూడున్నరేళ్లు కావస్తున్న సందర్భంగా నూతన సంవత్సరం–2018ను పురస్కరించుకుని ఆదివారం నగరంలోని జెడ్పీ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. తాను బాధ్యతలు చేపట్టిన వెంటనే అర్ధంతరంగా ఆగిపోయిన జెడ్పీ కార్యాలయానికి రూ.2కోట్ల నిధులు మంజూరు చేయించి పూర్తి చేయించినట్లు పేర్కొన్నారు. మరుగున పడిన జెడ్పీ అతిథి భవనాన్ని రూ.30లక్షలతో మరమ్మతులు చేయించినట్లు చెప్పారు. జెడ్పీ పాఠశాలలు, హాస్టళ్లలో రూ.2కోట్లతో టాయిలెట్స్, ఇతర మరమ్మతులు చేపట్టినట్లు వివరించారు. పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించేందుకు మార్గదర్శిని పుస్తకాన్ని రూ.50లక్షలతో ప్రచురించి, విద్యార్థులకు అందజేసినట్లు తెలిపారు. దీంతో ఉత్తమ ఫలితాలు సాధించినట్లు తెలిపారు. ఈ పుస్తకాన్ని మిగతా జిల్లాలతో పాటు తెలంగాణ ప్రభుత్వం కూడా కాపీరైట్స్ గురించి అడుగుతున్నాయని ఆనందం వ్యక్తం చేశారు. ఈ పనులు తనకు ఎంతో సంతృప్తి నిచ్చాయన్నారు. అలాగే 2014–15లో రూ.5 కోట్లతో జిల్లా అంతటా తాగునీటి బోర్లు వేయించామన్నారు. 2015–16లో ఒకేసారి 900 బోర్లు వేయించి ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తొలగించడం గొప్ప విషయమన్నారు. తాను పదవీ బాధ్యతలు చేపట్టే సమయానికి జెడ్పీ రూ.10 కోట్ల లోటు బడ్జెట్‌తో ఉందన్నారు. గతంలో ప్రభుత్వం నుంచి గ్రాంట్లు, ఆర్థిక సంఘం నిధులు, ఇసుక సీనరేజీ జెడ్పీకి ప్రధాన ఆదాయ వనరులుగా ఉండేవన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక అవన్ని ఆగిపోయాయని తెలిపారు. అలాగే జిల్లాస్థాయిలో పదో తరగతి పరీక్ష ఫలితాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానం సాధించిన విద్యార్థులకు రూ.15వేలు, రూ.10వేలు, రూ.5వేలు చొప్పున నగదు బహుమతులను, నియోజకవర్గ స్థాయిలో కూడా ఇలాగే అందిస్తున్నామన్నారు. గ్రిగ్స్ టోర్నమెంట్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మత్య్సకారులకు రూ.2.70కోట్లతో వలలు, సైకిళ్లు, వికలాంగులకు రూ.15లక్షలతో ట్రై సైకిళ్లు, అన్ని మండలాల్లో మహిళలకు కుట్టుమిషన్లు పంపిణీతో పాటు, కారుణ్య నియామకం కింద 72 మందికి ఉద్యోగాలు కల్పించామన్నారు. సిబ్బంది లేకపోవడం బాధాకరం జెడ్పీ పాఠశాలల్లో ఉపాధ్యాయులతో పాటు వాచ్మెన్లు, స్వీపర్లు కొరత తీవ్రంగా ఉండటం బాధాకరమన్నారు. ఏ ప్రభుత్వమైనా విద్యకు అధిక నిధులు కేటాయించి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. మా(జెడ్పీ) డబ్బులు మాకివ్వాలి అన్ని జిల్లాల్లో జరిగిన తీరుకు విరుద్ధంగా జెడ్పీ నుంచి ఉద్యోగులకు 2004 నుంచి రూ.28 కోట్లు పింఛన్లు చెల్లించామన్నారు. వాస్తవానికి పింఛన్లు ప్రభుత్వమే ట్రెజరీ ద్వారా చెల్లించాల్సి ఉందన్నారు. తాను బాధ్యతలు చేపట్టాక లోపాన్ని గుర్తించి ట్రెజరీ ద్వారా ఉద్యోగులకు పింఛన్లు ఇచ్చే ఏర్పాట్లు చేశామన్నారు. ఇప్పటి వరకు మా(జెడ్పీ) పరంగా చెల్లించిన నిధులు రూ.28 కోట్లు రీయింబర్స్మెంట్ కింద ప్రభుత్వం విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఇవి వస్తే అభివృద్ధి పనులకు డోకా ఉండదన్నారు. తాము ప్రతిపక్షంలో ఉన్నామని వివక్ష చూపకుండా ప్రభుత్వం నిధులు విడుదల చేయాలని కోరారు. తమకు సహకరించిన అధికార, ప్రతిపక్ష ప్రతినిధులకు, అధికారులకు అభినందనలు తెలిపారు. -
రగడ
జిల్లా పరిషత్ స్టాండింగ్ కమిటీ ఎన్నికల్లో టీడీపీ అధికారగర్వంతో వ్యవహరించింది. ఆధిపత్యం కోసం రభస సృష్టించింది. ఏకగ్రీవంగా జరగాల్సిన స్థాయి కమిటీ ఎన్నికల్లో అనవసర రాద్ధాంతాన్ని సృష్టించింది.రగడకు దిగి ఉద్రిక్త పరిస్థితులకు కారణమైంది. చివరకు భంగపాటుకు గురైంది. సాక్షి, కడప : కడప జెడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 11 గంటలకు జెడ్పీ చైర్మన్ గూడూరు రవి ఆధ్వర్యంలో సీఈఓ మాల్యాద్రి స్థాయి సంఘాల ఎన్నికల నిబంధనలను సభ్యులకు వివరించారు. ఎలా వ్యవహరించాలో చెబుతూ, చైర్మన్లు, సభ్యులను ఎన్నుకునే విధానాన్ని సైతం అందరికీ అర్థమయ్యేలా విశదీకరించారు. తరువాత సభను కొద్దిసేపు వాయిదా వేసి రెండు పక్షాల వారు ఎవరికి వారు అభ్యర్థుల ఎంపికకు సంబంధించి చర్చించుకునేందుకు అవకాశం కల్పించారు. అంత వరకు అంతా సవ్యంగానే సాగింది. ఆ తరువాతే అడ్డమైన వాదనలకు దిగి గందరగోళం సృష్టించేందుకు టీడీపీ శ్రేణులు కారణమయ్యాయి. రెచ్చిపోయిన పోరెడ్డి ప్రభాకరరెడ్డి సమావేశంలో అడుగడుగునా అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించిన టీడీపీ శ్రేణులు మధ్యాహ్నం భోజనం అనంతరం స్థాయి సంఘాల ఎన్నికకు సంబంధించి జెడ్పీ చైర్మన్ రవి, సీఈఓ మాల్యాద్రి వేదికపై నుంచి మాట్లాడేందుకు ప్రయత్నించగా జెడ్పీటీసీ సభ్యుడు పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా టీడీపీకి చెందిన జెడ్పీటీసీ సభ్యులను వెంట బెట్టుకొని వేదికపైకి దూసుకెళ్లారు. నిబంధనలు చెప్పకుండా ఎన్నికలు జరపడానికి వీల్లేదంటూ అభ్యంతరం లేవనెత్తారు. అక్కడే బైఠాయించారు. ఉదయం నుంచి ఎలాంటి అడ్డంకులు చెప్పకుండా ఇప్పుడు మాత్రమే ఎందుకిలా వ్యవహరిస్తున్నారంటూ చైర్మన్, సీఈఓ ప్రశ్నిస్తుండగానే, వేదికపైనున్న ఎన్నికలకు సంబందించిన పత్రాలను పోరెడ్డి చించివేశారు. ఎంత చెప్పినా ఆయన వినకుండా ఎన్నిక ఆపాల్సిందేనంటూ పట్టుబట్టారు. అక్కడే ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు సర్దిచెప్పేందుకు ప్రయత్నించగా పట్టించుకోలేదు. దీంతో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అంతలోనే ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, పి.రవీంద్రనాథరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, జయరాములు, ఎమ్మెల్సీ దేవగుడి నారాయణరెడ్డి తదితరులు జోక్యం చేసుకున్నారు. ఇలా ప్రతిసారి అడ్డుతగలడం మంచిది కాదని చెప్పారు. అధికారం ఉందికదా అంటూ బలహీన వర్గాలకు చెందిన జెడ్పీ చైర్మన్, సీఈఓను బెదిరింపులకు గురి చేయడం తగదన్నారు. జారుకున్న సీఈఓ మాల్యాద్రి సభలో పోరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఎన్నిక పత్రాలు చించివేయగానే సీఈఓ మాల్యాద్రి జారుకున్నారు. ఒక్కమాట కూడా మాట్లాడకుండా ఆయన వేదికపై నుంచి నిష్ర్కమించడం అనేక విమర్శలకు తావిచ్చింది. అధికార పార్టీ నుంచి తీవ్రమైన ఒత్తిళ్లు వ చ్చిన నేపథ్యంలోనే సీఈఓ అవమానం పేరుతో అక్కడి నుంచి తప్పుకోవడాన్ని వైఎస్సార్ సీపీ సభ్యులు తప్పుబట్టారు. ఎన్నికల వేళ.. రాద్ధాంతం జరగ్గానే సీఈఓ ఒక్క మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది. సీఈఓ వెళ్లిపోయాక కూడా చైర్మన్ హోదాలో రవి ఎన్నికను నిర్వహించేందుకు ప్రయత్నించగా టీడీపీ ప్రజాప్రతినిధులు మళ్లీ అడ్డుతగిలారు. దీంతో చైర్మన్ వెంటనే సీఈఓకు ఫోన్ చేసి ‘మీరెందుకు వెళ్లిపోయారు.. వెంటనే ఇక్కడి కి రండి’ అని కోరగా.. ‘నేను రాలేనంటూ’ సీఈఓ సమాధానం ఇవ్వడం విస్మయానికి గురి చేసింది. తిరిగి చైర్మన్ ఫోన్లో ‘ఎందుకు రాలేరంటూ’ ప్రశ్నించగా.. సీఈఓ నుంచి సమాధానం లేదు. దీంతో చైర్మన్ వెంటనే జరిగిన విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లేందుకు ఫోన్లో ప్రయత్నించగా.. ఆయన ఫోన్ లిఫ్ట్ చేయలేదు. వాగ్వాదంతో సభ వాయిదా ఎన్నికను అడ్డుకోవాలని టీడీపీ, జరిపించాలని వైఎస్సార్ సీపీ సభ్యులు పట్టుబట్టడంతో ఒక దశలో రెండు వర్గాల మధ్య వాగ్వాదం చెలరేగింది. అధికార పార్టీ సభ్యుల దురాగతాలను అడ్డుకునేందుకు చైర్మన్ రవికి అండగా వైస్ చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీటీసీ సభ్యులు సుదర్శన్‌రెడ్డి, సుదర్శనం, రామగోవింద్‌రెడ్డి, భూపేష్‌రెడ్డి, ప్రవీణ్‌కుమార్‌రెడ్డి, వీరారెడ్డి, ఇతర మహిళా సభ్యులు అండగా నిలిచారు. ఇది పద్ధతి కాదంటూ టీడీపీ సభ్యులకు సర్దిచెప్పేందుకు ప్రయత్నించారు. ఎంత చెప్పినా వారు పట్టించుకోలేదు. దీంతో సభ వాయిదా పడింది. దీంతో టీడీపీ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఆ తరువాత సభ ప్రారంభం కావడం, డెప్యూటీ సీఈఓ బాలసరస్వతి సమక్షంలో చైర్మన్ రవి ఎన్నికలను నిర్వహించారు. అన్ని విభాగాలకు సంబంధించిన సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
మండల పరిషత్‌ల్లో మహిళలకు 19 స్థానాలు
విజయనగరం ఫోర్ట్, న్యూస్‌లైన్: మండల పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్లలో మహిళలకు పెద్ద పీటవేశారు. ఈ మేరకు జిల్లా పరిషత్ ముఖ్యకార్యనిర్వహణ అధికారి ఎన్.మోహన్‌రావు శనివారం రిజర్వేషన్ల వివరాలు వెల్లడించారు. జిల్లాలో 34 మండల పరిషత్ అధ్యక్ష స్థానాలు ఉన్నాయి. వీటిలో మహిళలకు 19 స్థానాలు, 15 స్థానాలకు జనరల్‌కు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీలకు చెరో నాలుగు స్థానాలు కేటాయించగా, బీసీలకు 17స్థానాలు, ఓసీలకు తొమ్మిది స్థానాలు కేటాయించారు. నాలుగు ఎస్టీ స్థానాల్లో మూడింటిని మహిళలకు కేటాయించగా, ఒక స్థానాన్ని జనరల్‌కు కేటాయించారు. అదేవిధంగా నాలుగు ఎస్సీ స్థానాల్లో రెండు మహిళలకు, రెండు జనరల్‌కు కేటాయించారు. 17 బీసీ స్థానాల్లో మహిళలకు తొమ్మిది, జనరల్‌కు ఎనిమిది స్థానాలు కేటాయించారు. తొమ్మిది ఓసీ స్థానాల్లో మహిళలకు ఐదు, జనరల్‌కు నాలుగు స్థానాలు కేటాయించారు మహిళలకే అధిక స్థానాలు: మండల పరిషత్ అధ్యక్ష స్థానాల్లో ఈసారి మహిళలకే పెద్దపీట వేశారు. అన్ని కేటగిరీల నుంచి మొత్తం 19 మహిళలకు కేటాయించారు. గత ఎన్నికల్లో మహిళలకు 14 స్థానాలు కేటాయించగా ఈ సారి ఐదు స్థానాలు పెరిగాయి మండల్ పరిషత్ అధ్యక్షుల రిజర్వేషన్ వివరాలు మండలం ఎంపీపీ స్థానం గుమ్మలక్ష్మీపురం ఎస్టీ మహిళ పార్వతీపురం ఎస్టీ మహిళ వేపాడ ఎస్టీ మహిళ మెంటాడ ఎస్టీ జనరల్ బొండపల్లి ఎస్సీ మహిళ గరుగుబిల్లి ఎస్సీ మహిళ గంట్యాడ ఎస్సీ జనరల్ జామి ఎస్సీ జనరల్ బొబ్బిలి బీసీ మహిళ చీపురుపల్లి బీసీ మహిళ కొమరాడ బీసీ మహిళ కొత్తవలస బీసీ మహిళ కురుపాం బీసీ మహిళ మక్కువ బీసీ మహిళ పాచిపెంట బీసీ మహిళ సీతానగరం బీసీ మహిళ గుర్ల బీసీ మహిళ బాడంగి బీసీ జనరల్ బలిజిపేట బీసీ జనరల్ దత్తిరాజేరు బీసీ జనరల్ డెంకాడ బీసీ జనరల్ గరివిడి బీసీ జనరల్ మెరకముడిదాం బీసీ జనరల్ రామభద్రపురం బీసీ జనరల్ ఎస్.కోట బీసీ జనరల్ గజపతినగరం ఓసీ మహిళ జియ్యమ్మవలస ఓసీ మహిళ నెల్లిమర్ల ఓసీ మహిళ సాలూరు ఓసీ మహిళ తెర్లాం ఓసీ మహిళ భోగాపురం ఓసీ జనరల్ ఎల్.కోట ఓసీ జనరల్ పూసపాటిరేగ ఓసీ జనరల్ విజయనగరం ఓసీ జనరల్