ఎంపీపీ వెంకటసుబ్బమ్మ
ముత్తుకూరు: విద్యార్థులు ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా పదో తరగతి పరీక్షలను బాగా రాయాలని ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ అన్నారు. ముత్తుకూరు జెడ్పీ హైస్కూల్‌లో టెన్త్ పరీక్షలకు హాజరయ్యే 145 మంది విద్యార్థులకు సోమవారం పెన్నులు, జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, కష్టపడి చదివే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎంఈఓ ఆర్.మురళీధర్, మండల ఉపాధ్యక్షుడు మురాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యుడు గండవరం సుగుణ, ఈఓపీఆర్‌డీ చెంచుకృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్, అడిషనల్ హెచ్‌ఎం షరీఫ్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
పరీక్షల్లో భయం వీడండి
ఇనుకుర్తి(పొదలకూరు) : టెన్త్ విద్యార్థులు పరీక్షల్లో భయం వీడి చక్కగా పరీక్షలను రాయాలని తహశీల్దార్ వి.కృష్ణారావు సూచించారు. మండలంలోని ఇనుకుర్తి జెడ్పీ హైస్కూల్ టెన్త్ విద్యార్థులకు సర్పంచ్ అక్కెం రాఘవరెడ్డి తండ్రి అక్కెం రమణారెడ్డి జ్ఞాపకార్థం సోమవారం పరీక్ష సామాగ్రిని అందజేశారు.
తహశీల్దార్ మాట్లాడుతూ దాతలు మందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం మంచిపరిణామంగా పేర్కొన్నారు. సర్పంచ్ రాఘవరెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలోని హైస్కూల్‌పై ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులంతా కలసి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్‌సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి పాఠశాల హెడ్‌మాస్టర్ మస్తాన్‌సాహెబ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.