Tenth tests
-
‘గురుకులం’లో రోజూ థర్మల్ స్క్రీనింగ్
సాక్షి, హైదరాబాద్: టెన్త్ పరీక్షలు తిరిగి ప్రారంభంకా నుండటంతో విద్యార్థుల పట్ల తీసుకోవల్సిన జాగ్రత్తల పై గురుకుల సొసైటీలు సన్నద్ధమవుతున్నాయి. విద్యార్థులకు వసతి, పరీక్షా కేంద్రాల వరకు రవాణా సౌకర్యం లాంటి ఏర్పాట్లు పక్కాగా చేసేందుకు ఉపక్రమించాయి. రాష్ట్రవ్యాప్తంగా 900 ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకుల పాఠశాలల నుంచి దాదాపు 50 వేల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే తెలుగు పేపర్–1, 2, హిందీ పరీక్షలు ముగియగా... కరోనా నేపథ్యంలో మిగతా పరీక్షలను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తిరిగి ఈ నెల 8 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు ప్రకటించింది. దీంతో గురుకుల విద్యార్థులను వారం ముందే పాఠశాలలకు చేరుకోవాలని అధికారులు ఆదేశించారు. సోమవారం నాటికి 90 శాతం మంది విద్యార్థులు చేరుకున్నారు. అనుక్షణం అప్రమత్తం: ఇప్పటికే అన్ని పాఠశాలలను సోడియం హైపోక్లోరైడ్‌తో మూడుసార్లు శానిటైజ్ చేశారు. పాఠశాలకు వచ్చిన విద్యార్థికి వ్యక్తిగత శానిటైజర్, సబ్బు, మాస్కులు అందిస్తున్నారు. భౌతిక దూరం పాటించేలా సూచనలు చేస్తున్నారు. పరీక్షల నేపథ్యంలో గురుకుల పాఠశాలల సిబ్బంది మే 28 నుంచే విధులకు హాజరువుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా భౌతిక దూరంపాటించేలా బెడ్లు ఏర్పాటు చేయడంతో పాటు స్టడీ హాలులో కుర్చీలను ఏర్పాటు చేశారు. వంట సిబ్బందికి ప్రత్యేకంగా డ్రెస్‌కోడ్ పాటిస్తూ గ్లౌజులు, మాస్కులు ధరించి వంట వడ్డించేలా సూచనలు చేశారు. ప్రతి విద్యార్థికి రోజూ థర్మల్ స్క్రీనింగ్ పరీక్షలు చేస్తారు. దీనికోసంప్రతి స్కూల్‌కు ఒక ధర్మల్ స్క్రీనింగ్ యంత్రాన్ని పంపిణీ చేశారు. శరీర ఉష్ణోగ్రతల్లో తేడాలుంటే వెంటనే వైద్య పరీక్షలు నిర్వహిస్తారు. ప్రతి గురుకుల పాఠశాలలో ఒక హెల్త్ అసిస్టెంట్‌ను ఏర్పాటు చేసిన సొసైటీ అధికారులు... 24గంటలు అక్కడే అందుబాటులో ఉండాలని ఆదేశించారు. రోగనిరోధక శక్తి పెరిగేలా ఆహారం.. టెన్త్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల పట్ల అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ప్రతి పాఠశాల ప్రిన్సిపాల్, బోధన, బోధనేతర సిబ్బందికి ఆదేశాలు జారీ చేసినట్టు బీసీ గురుకుల విద్యా సంస్థల సొసైటీ కార్యదర్శి మల్లయ్యభట్టు తెలిపారు. పోషకాహారాన్ని అందించే లా డైట్ చార్ట్‌ను మార్చామని, రోగ నిరోధకశక్తి పెరిగే ఆహార పదార్థాలు ఇవ్వాలని ఆదేశించామని చెప్పారు. -
స్కూళ్ల అకడమిక్ కేలండర్ ఇదే!
మార్చి మొదటివారంలోనే టెన్త్ పరీక్షలు మార్చి 21 నుంచే కొత్త విద్యా సంవత్సరం షురూ సాక్షి, హైదరాబాద్: వేసవి సెలవుల తర్వాత ఈ నెల 13 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. కొత్త విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో అమలు చేయాల్సిన విద్యా కార్యక్రమాలు, పరీక్షల నిర్వహణ, సెలవులకు సంబంధించిన సమగ్ర వివరాలతో విద్యాశాఖ బుధవారం అకడమిక్ కేలండర్‌ను ప్రకటించింది. పాఠశాలల్లో ఇందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని డీఈవోలను ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి నెలలో చేపట్టాల్సిన కార్యాచరణను పంపించింది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి 2017 ఫిబ్రవరి 28 వరకు స్కూళ్లలో పాఠాలను బోధించాలి. పదోతరగతికి మాత్రం ఈ నెల 13న పాఠ్యాంశాల బోధన చేపట్టి వచ్చే ఏడాది జనవరి 31 నాటికి పూర్తి చేయాలి. స్కూళ్ల పని వేళలు ఇలా.. ఉన్నత పాఠశాలలు: ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 4:45 గంటల వరకు. రోజుకు 7 గంటల 15 నిమిషాలు కొనసాగాలి ప్రాథమికోన్నత పాఠశాలలు: ఆరు నుంచి 8వ తరగతి వరకు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4:15 గంటల వరకు(7 గంటల 15 నిమిషాలు) పని చేయాలి ప్రాథమిక పాఠ శాలలు, వాటిలోని అప్పర్ ప్రైమరీ సెక్షన్లు: ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు(ఏడు గంటలు) పని చేయాలి పరీక్షల షెడ్యూలు ఇదీ.. ఫార్మేటివ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ)-1: పని దినాలు 39 రోజులు. జూలై 30వరకు బోధించి, పరీక్షలు నిర్వహించాలి. విద్యార్థుల సామర్థ్యాలను రిజిస్టర్ చేయాలి ఫార్మేటివ్-2: 41 రోజుల పనిదినాలు. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించాలి. ఆగస్టు 1 నుంచి సెప్టెంబర్ 22 వరకు పని చేయాలి. సెప్టెంబర్ 22లోగా పరీక్షలు నిర్వహించి, సామర్థ్యాలను రికార్డు చేయాలి సమ్మేటివ్ అసెస్మెంట్ (ఎస్ఏ)-1 (త్రైమాసిక పరీక్షలు): అక్టోబర్ 27 నుంచి నవంబర్ 3 వరకు నిర్వహించాలి. విద్యార్థులకు జవాబు పత్రాలను ఇవ్వాలి. ఫలితాలను నవంబర్ 7న ప్రకటించాలి. ఫలితాలను నవంబర్ 10 వరకు రికార్డు చేయాలి. 11న పేరెంట్స్ మీటింగ్ నిర్వహించాలి. ఎఫ్ఏ-3: అక్టోబర్ 15 నుంచి డిసెంబర్ 9 వరకు. 57 పని దినాలు. డిసెంబర్ 9లోగా పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను నమోదు చేయాలి ఎఫ్ఏ-4: ఒకటో తరగతి నుంచి 9వ తరగతి వారికి 2017 ఫిబ్రవరి 20 వరకు. పదో తరగతి వారికి ఫిబ్రవరి 4 వరకు మొత్తంగా 52 రోజులు పని చేయాలి. విద్యార్థుల సామర్థ్యాలు రిజిస్టర్ చేయాలి. ఎస్ఏ-2: వచ్చే ఏడాది మార్చి 7 నుంచి 15 వరకు ఒకటి నుంచి 9 తరగతులకు వార్షిక పరీక్షలు. మార్చి 19న విద్యార్థులకు జవాబు పత్రాలు ఇవ్వాలి. ఫలితాలను రికార్డు చేయాలి. 20న తల్లిదండ్రుల సమావేశం నిర్వహించాలి. - 2017 ఫిబ్రవరి 6 నుంచి 18 వరకు: పదో తరగతి వారికి ప్రీ ఫైనల్ పరీక్షలు. మార్చి మొదటి వారంలో వార్షిక పరీక్షలు. క్రీడలు.. ఆగస్టు 5లోగా పాఠశాల స్థాయిలో నిర్వహించాలి. ఆగస్టు 20 నుంచి సెప్టెంబర్ 5 వరకు మండల/డివిజన్ స్థాయిలో, సెప్టెంబర్ 8 నుంచి 20 వరకు జిల్లా స్థాయిలో నిర్వహించాలి. ఎంపికైన విద్యార్థులను సెప్టెంబర్/అక్టోబర్‌లో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల పోటీలకు పంపించాలి. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
-
టెన్త్ పరీక్షలపై ఆందోళన వద్దు
ఎంపీపీ వెంకటసుబ్బమ్మ ముత్తుకూరు: విద్యార్థులు ఎటువంటి ఆందోళనలకు గురికాకుండా పదో తరగతి పరీక్షలను బాగా రాయాలని ఎంపీపీ తేట్ల వెంకటసుబ్బమ్మ అన్నారు. ముత్తుకూరు జెడ్పీ హైస్కూల్లో టెన్త్ పరీక్షలకు హాజరయ్యే 145 మంది విద్యార్థులకు సోమవారం పెన్నులు, జామెంట్రీ బాక్సులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ, కష్టపడి చదివే వారికి మంచి భవిష్యత్తు ఉంటుందన్నారు. ఎంఈఓ ఆర్.మురళీధర్, మండల ఉపాధ్యక్షుడు మురాల వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ సభ్యుడు గండవరం సుగుణ, ఈఓపీఆర్డీ చెంచుకృష్ణయ్య, పంచాయతీ కార్యదర్శి వరప్రసాద్, అడిషనల్ హెచ్ఎం షరీఫ్, ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పరీక్షల్లో భయం వీడండి ఇనుకుర్తి(పొదలకూరు) : టెన్త్ విద్యార్థులు పరీక్షల్లో భయం వీడి చక్కగా పరీక్షలను రాయాలని తహశీల్దార్ వి.కృష్ణారావు సూచించారు. మండలంలోని ఇనుకుర్తి జెడ్పీ హైస్కూల్ టెన్త్ విద్యార్థులకు సర్పంచ్ అక్కెం రాఘవరెడ్డి తండ్రి అక్కెం రమణారెడ్డి జ్ఞాపకార్థం సోమవారం పరీక్ష సామాగ్రిని అందజేశారు. తహశీల్దార్ మాట్లాడుతూ దాతలు మందుకు వచ్చి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించడం మంచిపరిణామంగా పేర్కొన్నారు. సర్పంచ్ రాఘవరెడ్డి మాట్లాడుతూ తమ గ్రామంలోని హైస్కూల్‌పై ఉపాధ్యాయులతో పాటు గ్రామస్తులంతా కలసి ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్టు వెల్లడించారు. సమావేశంలో మాజీ ఎంపీటీసీ సభ్యుడు, వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పెదమల్లు రమణారెడ్డి పాఠశాల హెడ్మాస్టర్ మస్తాన్‌సాహెబ్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
రేపటి నుంచి టెన్త్ పరీక్షలు
పరీక్షలు రాయనున్న విద్యార్థులు 8.26 లక్షల మంది మే మూడో వారంలో ఫలితాలు సాక్షి, బెంగళూరు : పదో తరగతి వార్షిక పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభ ం కానున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 8,26,269 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇందులో 4.88 లక్షల మంది బాలురు, 3.37 లక్షల మంది బాలికలు ఉన్నారు. కాగా పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఎస్ఎస్ఎల్సీ బోర్డ్ సెక్రెటరీ నాగేంద్ర కుమార్ ‘సాక్షి’తో పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3,016 పరీక్షా కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు. గత అనుభవాల దృష్ట్యా ఇందులో 161 సమస్యాత్మక, 51 అతి సమస్యాత్మక కేంద్రాలుగా విద్యాశాఖ గుర్తించింది. వీటిలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరకకుండా ఉండేందుకు ఎక్కువ సంఖ్యలో స్క్వాడ్లను ఏర్పాటు చేయడమే కాకుండా పరీక్ష కేంద్రంలో వీడియో చిత్రీకరణ చేయనున్నారు. ఈ విధంగా వీడియో తీయడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈసారి పదోతరగతి ఫలితాలు కొంత ఆలస్యంగా వెలువడే అవకాశం ఉంది. మొదట్లో వచ్చేనెల 14 నుంచి పరీక్షల మూల్యాంకనం ప్రారంభించాలని విద్యాశాఖ భావించింది. అయితే అదే నెల 17న రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఓటింగ్ జరగనుంది. దీంతో మూల్యాంకనం ఏప్రిల్ 20న ప్రారంభించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఇది మరికొంత ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నట్లు సిబ్బంది పేర్కొంటున్నారు. అందువల్ల మొదట్లో అనుకున్నట్లు మే మొదటి వారంలో కాకుండా మే మూడో వారంలో పదోతరగతి ఫలితాలు వెలువడే అవ కాశం ఉన్నట్లు సమాచారం. -
ఆల్ ద బెస్ట్
నేటి నుంచే టెన్త్ పరీక్షలు జంట జిల్లాల నుంచి 1.85 లక్షల మంది సాక్షి, సిటీబ్యూరో : మరికొద్ది గంటల్లో టెన్త్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లను పూర్తి చేశారు. జంట జిల్లాల నుంచి మొత్తం 1,85,390 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కానున్నారు. ఏప్రిల్ 15 వరకు కొనసాగనున్న పరీక్షల నిమిత్తం 813 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. ప్రతిరోజూ ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలుండే మార్గాల్లో ఆర్టీసీ 300 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. ఆకస్మిక తనిఖీల నిమిత్తం రెవెన్యూ, పోలీసు అధికారులతో కూడిన స్క్వాడ్ బృందాలను నియమించినట్లు అధికారులు తెలిపారు. -
ప్రిపరేషన్ పదింతలు
మరో నెలరోజుల్లో టెన్త్ పరీక్షలు పక్కాగా వంద రోజుల ప్రణాళిక {పిపరేటరీ ఫలితాలపై చర్యలు-డీఈవో సాక్షి, విశాఖపట్నం : పది పరీక్షలు ముంచుకొస్తున్నాయి. మరో నెల రోజులు మాత్రమే మిగిలున్నాయి. విద్యార్థులు పుస్తకాలతో.. ఉపాధ్యాయులు పునఃశ్చరణ తరగతుల్లో బిజీగా ఉన్నారు. సమైక్యాంధ్ర సమ్మె ప్రభావం ఫలితాలపై పడకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. కనీసం గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రణాళికలు అమలు చేస్తున్నారు. కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో పర్యవేక్షణలో వంద రోజుల ప్రణాళిక సమర్థవంతంగా అమలవుతోంది. ఇప్పటికే 65 రోజులు గడిచిపోయాయి. అదనపు తరగతులు.. పరీక్షలు ఎంతగా సెలవురోజులు, ఆదివారాలు పనిచేస్తున్నా.. సిలబస్ పూర్తి చేశామనిపించుకున్నారు తప్ప, పూర్తి స్థాయిలో టెన్త్ విద్యార్థులకు న్యాయం చేయలేకపోయారన్నది నిర్వివాదాంశం. అందుకే రోజూ ఉదయం, సాయంత్రం అదనపు తరగతులు కొనసాగిస్తున్నారు. కొన్ని చోట్ల నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులకు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి, ఉప విద్యాశాఖాధికారి సి.వి.రేణుక ఆకస్మిక తనిఖీలతో దడ పుట్టిస్తున్నారు. ఇప్పటికే సుమారు 20 మందికి మెమోలిచ్చారు. ఇందులో ఐదుగురు ప్రధానోపాధ్యాయులు కూడా ఉన్నారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షణలో భాగంగా ఎంఈవోలను కూడా అప్రమత్తం చేశారు. రోజూ కనీసం రెండు ఉన్నత పాఠశాలల్ని తనిఖీ చేయాలన్న ఆదేశాలున్నాయి. ప్రస్తుతం ప్రిపరేటరీ పరీక్షలు జరుగుతున్నాయి. శుక్రవారంతో ఈ పరీక్షలు ముగియనున్నాయి. వీటి ఫలితాల ఆధారంగా మరోసారి ఏబీసీడీ గ్రేడ్లు విభజించి, సీ,డీ గ్రేడ్లవారిపై అదనపు శ్రద్ధ చూపనున్నారు. గ్రేడ్ దాటాల్సిందే! : ప్రిపరేటరీ పరీక్షల్లో విద్యార్థుల ఫలితాల ఆధారంగా విధుల్లో నిర్లక్ష్యంగా ఉన్న ఉపాధ్యాయులపై చర్యలు తీసుకోనున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి బి.లింగేశ్వరరెడ్డి తెలిపారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ వంద రోజుల ప్రణాళికలో భాగంగా గతంలోనే విద్యార్థుల గ్రేడ్లను నిర్ణయించి, అదనపు శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించామన్నారు. అయినప్పటికీ ప్రిపరేటరీ పరీక్షల్లో మార్పు కనిపించకపోతే క్షమించేది లేదని హెచ్చరించారు. త్వరలో జరిగే హోప్ ఎగ్జామ్స్ నాటికి డి గ్రేడ్ విద్యార్థులు కనిష్ట స్థాయికి చేరుకోవాలన్న లక్ష్యంగా ప్రధానోపాధ్యాయులు, సంబంధిత సబ్జెక్టు టీచర్లు కృషి చేయాలని సూచించారు. డి గ్రేడ్ విద్యార్థులకు ప్రధానాంశాలు, తరచూ వచ్చే ప్రశ్నలపై ఎక్కువగా తర్ఫీదిచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రిపరేటరీ పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచినవారిని 10కి 10 గ్రేడ్ పాయింట్లు సాధించేలా ప్రత్యేక శిక్షణివ్వాల్సిన బాధ్యత ఉపాధ్యాయులదేనన్నారు.