క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించొద్దు | Dont creat admissions under sports quota | Sakshi
Sakshi News home page

క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించొద్దు

Published Sat, Sep 24 2016 1:30 AM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించొద్దు - Sakshi

క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించొద్దు

ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయానికి హైకోర్టు ఆదేశం

 సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో 2016-17 విద్యా సంవత్సరానికి క్రీడల కోటా కింద ప్రవేశాలు కల్పించవద్దని హైకోర్టు శుక్రవారం ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయాన్ని ఆదేశించింది. సుప్రీంకోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకున్న వారి కోసం క్రీడల కోటాలో నాలుగు సీట్లను పక్కన పెట్టి మిగిలిన సీట్లను కన్వీనర్ కోటా ద్వారా భర్తీ చేయాలని స్పష్టం చేసింది.

ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ వి.రామసుబ్రమణియన్, జస్టిస్ అనిస్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. క్రీడల కోటాలో మెరిట్ జాబితా రూపకల్పలో అక్రమాలు చోటు చేసుకున్నాయని, అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ ప్రకాశం జిల్లాకు చెందిన జి.తన్మయ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై కోర్టు శుక్రవారం విచారణ జరిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement