డీఎంహెచ్‌ఓగా డాక్టర్ నాగమల్లేశ్వరి | Dr. nagamalleshwari as dmh | Sakshi
Sakshi News home page

డీఎంహెచ్‌ఓగా డాక్టర్ నాగమల్లేశ్వరి

Published Sun, Aug 31 2014 2:09 AM | Last Updated on Sat, Sep 2 2017 12:38 PM

డీఎంహెచ్‌ఓగా డాక్టర్ నాగమల్లేశ్వరి

డీఎంహెచ్‌ఓగా డాక్టర్ నాగమల్లేశ్వరి

గుంటూరు మెడికల్: జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిగా డాక్టర్ రావిపాటి నాగమల్లేశ్వరిని నియమిస్తూ రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్యులు జారీ చేశారు. ప్రస్తుతం ఆమె అదనపు జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిగా పనిచేస్తున్నారు. జిల్లాలోని యడ్లపాడు గ్రామానికి చెందిన ఆమె గుంటూరు వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ చదివారు. కొనాళ్లు కొత్తపేటలోని ప్రైవేటు ఆస్పత్రిలో ప్రాక్టీస్ చేసి 1987 జూన్‌లో ప్రకాశం జిల్లా ఇంకొల్లు మెడికల్ ఆఫీసర్‌గా ప్రభుత్వ సర్వీస్‌లోకి ప్రవేశించారు.

ఇన్‌సర్వీస్ కోటాలో గుంటూరు వైద్య కళాశాలలో పీజీ(ఫార్మకాలజీ) చేశారు. 2012లో డిప్యూటీ సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది సత్తెనపల్లి, చిలుకలూరిపేట ఆస్పత్రుల్లో పనిచేశారు. తర్వాత సివిల్ సర్జన్‌గా పదోన్నతి పొంది 2013 ఏప్రిల్ నుంచి అదనపు డీఎంహెచ్‌ఓగా పనిచేస్తున్నారు. మూవ్‌మెంట్ ఉత్తర్వులు వచ్చాక గురువారం విధుల్లో చేరతానని డాక్టర్ నాగమల్లేశ్వరి తెలిపారు.
 
డాక్టర్ గోపీనాయక్‌కు బదిలీ
జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారిగా పనిచేస్తున్న డాక్టర్ మీరావత్ గోపీనాయక్‌ను బదిలీ చేస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఈ నెల 21 నాటికి డీఎంహెచ్‌ఓగా ఐదేళ్లు పూర్తరుునందున పరిపాలన కారణాలతో బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఎక్కడా పోస్టింగ్ కేటాయించకుండా ప్రభుత్వానికి రిపోర్ట్ చేయాలని సూచించారు.
 
ప్రాంతీయ శిక్షణ  కేంద్రం ప్రిన్సిపాల్‌గా డాక్టర్ పద్మజారాణి
గుంటూరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని ప్రాంతీయ శిక్షణ  కేంద్రం(ఫీమేల్) ప్రిన్సిపాల్‌గా డాక్టర్ తిరుమలశెట్టి పద్మజారాణిని నియమిస్తూ వైద్యఆరోగ్యశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ఎల్.వి.సుబ్రహ్మణ్యం శనివారం ఉత్తర్యులు జారీచేశారు. ప్రస్తుతం ఆమె మంగళగిరి ప్రభుత్వ ఆస్పత్రిలో రెసిడెంట్ మెడికల్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. ప్రాంతీయ శిక్షణ  కేంద్రం ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్న డాక్టర్ శ్రీధర్ బాబు మార్చి 31న పదవీ విరమణ చేయటంతో ఏప్రిల్ 1 నుంచి పద్మజారాణి ఇన్‌చార్జి ప్రిన్సిపాల్‌గా వ్యవహరిస్తున్నారు. ఉత్తర్వులు అందిన తర్వాత బుధవారం లేదా గురువారం విధుల్లో చేరతానని ఆమె తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement