’బాహుబలి’ కోసం మందుబాబుల వీరంగం! | drunkerd attack on theatre for bahubali | Sakshi
Sakshi News home page

’బాహుబలి’ కోసం మందుబాబుల వీరంగం!

Published Mon, May 29 2017 8:39 AM | Last Updated on Fri, May 25 2018 2:06 PM

’బాహుబలి’ కోసం మందుబాబుల వీరంగం! - Sakshi

’బాహుబలి’ కోసం మందుబాబుల వీరంగం!

అనంతపురం: రికార్డు కలెక్షన్లతో దూసుకెళుతున్న ’బాహుబలి-2’ సినిమా కోసం మందుబాబులు వీరంగం వేశారు. గుత్తిలో ఆదివారం అర్ధరాత్రి కొందరు వ్యక్తులు మద్యం మత్తులో కేపీఎస్‌ థియేటర్‌ వద్ద గొడవకు దిగారు. లేడి లేచిందే పరుగు అన్నట్టు తమకోసం అర్ధరాత్రి బాహుబలి-2 షో వేయాలంటూ పట్టుబట్టారు. ఇందుకు థియేటర్‌ సిబ్బంది నిరాకరించారు.

దీంతో కోపోద్రిక్తులైన మందుబాబులు వారిపై దాడికి దిగారు. అర్ధరాత్రి మందుబాబులు వీరంగం వేసిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో నమోదయ్యాయి. ఈ దృశ్యాలను పరిశీలించిన పోలీసులు కేసు నమోదుచేసి.. నిందితుల కోసం గాలిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement