*ఏపీకి రూ.300 కోట్లకు గండి
*ఎర్రచందనం టెండరును వదులుకున్న డైమండ్ స్టార్
హైదరాబాద్: ఎర్రచందనం కొనుగోలు టెండరు దక్కించుకున్న దుబాయ్ సంస్థ డైమండ్ స్టార్ చేతులెత్తేసింది. దీంతో ఎర్రచందనం ఈ-టెండర్ల ద్వారా ఏపీ ప్రభుత్వం చేతికొచ్చినట్లేననుకున్న రూ.300 కోట్ల రాబడికి గండిపడింది. మొదటి విడత ఈ వేలంలో పెట్టిన 4,169 టన్నుల్లో 2,694 టన్నులకు మాత్రమే టెండర్లు ఖరారు కావడం, ఇందులో 569.99 టన్నుల టెండరు కైవసం చేసుకున్న దుబాయ్ సంస్థ డైమండ్ స్టార్ డబ్బు చెల్లించకుండా ముఖం చాటేయడం ప్రభుత్వానికి నిరాశ కలిగించింది. కాగా ఈ నెలలోనే రెండో విడత ఈ-వేలం నోటిఫికేషన్ జారీచేస్తామని రాష్ట్ర అటవీశాఖ అదనపు ప్రధాన అటవీ సంరక్షణాధికారి మురళీకృష్ణ 'సాక్షి'కి తెలిపారు.