ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్న దుబాయ్ షేట్ | Dubai shet married two minor girls | Sakshi
Sakshi News home page

ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్న దుబాయ్ షేట్

Published Sat, Apr 19 2014 7:44 PM | Last Updated on Sat, Sep 29 2018 5:41 PM

Dubai shet married two minor girls

హైదరాబాద్: ఇద్దరు బాలికలను పెళ్లి చేసుకున్న దుబాయ్ షేట్ను సౌత్‌జోన్‌ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దుబాయ్‌ షేక్‌ టూరిస్ట్‌ వీసాపై మనదేశానికి  వచ్చి ఇలాగే బాలికలను పెళ్లిళ్లు చేసుకుంటాడని తెలుస్తోంది. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఈ షేట్ నగరానికి వచ్చాడు.  పాతబస్తీకి చెందిన ఇద్దరు  బాలికలను వివాహం చేసుకున్నాడు. విషయం తెలిసిన సౌత్‌జోన్‌  పోలీసులు అతనిని అరెస్ట్ చేశారు. ఆ ఇద్దరు బాలికలకు విముక్తి కల్పించారు.

షేట్  బాలికలను వివాహం చేసుకోవడానికి సహకరించిన 10 మంది బ్రోకర్లను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ షేట్  గతంలో కేరళలోనూ ఇదే విధంగా పెళ్లిళ్లు చేసుకున్నట్లు పోలీసులు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement